LCD మోనిటర్‍పై దుమ్ము, వేలిముద్రలు పడినప్పుడు సున్నితంగా ఉండే
గుడ్డను తీసుకోండి. మామూలు నీళ్ళలో ఉండే లవణపు పరిమాణం వల్ల
స్క్రీన్‍పై మరకలు పడతాయి కాబట్టి డిస్టిల్ వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో
కొద్దిగా వెనిగర్‍ని కలిపి పల్చని మిశ్రమంగా చేయండి.ఇప్పుడు మోనిటర్‍ని
ఆఫ్ చేయండి. లేదా black బ్యాక్‍గ్రౌండ్ సెట్ చేయడం ద్వారా
మోనిటర్‍పై ఉన్న దుమ్ము స్పష్టంగా కన్పిస్తుంది. ఎక్కడైతే దుమ్ముందో
అక్కడ ఆ మిశ్రమంలో పల్చని గుడ్డని తడిపి సున్నితంగా ఒకే దిశలొ
(పైకి క్రిందకి) తుడవండి.మందపాటి గుడ్డని వాడితే LCD మోనిటర్
స్క్రీన్‍పై గీతలు పడతాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి