30, సెప్టెంబర్ 2007, ఆదివారం

ప్లాష్ ఏనిమేషన్లని అడ్డుకోవడానికి


ఇటీవలి కాలంలో ఇంటర్నెట్లో మనం ఏ వెబ్ సైట్ ని ఓపెన్ చేస్తున్నా ప్రతీ పేజీలోనూ తప్పనిసరిగా కొన్ని ఫ్లాష్ ఏనిమేషన్లు దర్శనమిస్తున్నాయి. దాదాపు ఇవన్నీ అడ్వర్ టైజ్ మెంట్లు కావడం గమనార్హం. ఇలాంటి మనకు ఏమాత్రం అవసరం లేని ఫ్లాష్ అడ్వర్ టైజ్ మెంట్లు సిస్టంలోకి ప్రవేశించడానికి ఎక్కువ నెట్ బ్యాండ్ విడ్త్ ని ఉపయోగించుకుంటాయి. మనం ఏ సమాచారాన్నయితే కోరుకుంటామో దానికి ప్రాధాన్యత

ఇవ్వబడకపోగా ఉన్న బ్యాండ్ విడ్త్ మొత్తాన్నీ ఈ ప్రకటనలే హరిస్తుంటాయి. ఈ నేపధ్యంలో నెట్ కి కనెక్ట్ అయినప్పుడు వెబ్ పేజీల్లో ఫ్లాష్ పైళ్లనేవే చూపించబడకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. అదెలాగంటే Start>Run కమాండ్ బాక్స్ల్ లోకి వెళ్లి.. regsvr32 c:\windows\system32\macromed\Flash\swflash.ocx/u అని టైప్ చేసి (IE7లో swflash.ocx బదులు flash9c.ocx అనే ఫైల్ పేరు టైప్ చేయాలి) OK బటన్ ప్రెస్ చేయండి. దీంతో ఇకపై వెబ్ పేజీల్లో ఏ విధమైన ఫ్లాష్ ఏనిమేషన్లూ చూపించబడవు. భవిష్యత్సులో ఎప్పుడైనా తిరిగి ఫ్లాష్ ఏనిమేషన్లు చూపించబడేలా ఏర్పాటు చేసుకోవాలంటే మళ్ళీ Start>Run కమాండ్ బాక్స్ లోనే regsvr32 c:\windows\system32\macromed\Flash\swflash.ocx అని టైప్ చేసి OK బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది.

కామెంట్‌లు లేవు: