1, సెప్టెంబర్ 2007, శనివారం

డిస్పోజబుల్ మెయిల్ ఐడి కావాలా...



స్నేహితులు, సన్నిహితుల నుండి మెయిల్ మెసేజ్‌లు అందుకోవడానికి, పంపుకోవడానికి క్రియేట్ చేసుకున్న మన ప్రధానమైన మెయిల్ ఐడిని కొన్ని వెబ్‌సైట్లు, ఫోరమ్‌ల వంటి వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వచ్చినపుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వెల్లడించవలసి వస్తోంది. ఇంకేముంది... మన మెయిల్ అడ్రస్ తెలిసిందే తడవుగా ఆయా వెబ్‌సైట్లు స్పాం మెసేజ్‌లతో మన inboxని నింపేస్తుంటాయి. ఈ బాధలన్నీ లేకుండా వాడిపారేసే ఓ డిస్పోజబుల్ మెయిల్ ఐడి ఉంటే బాగుణ్ణు అనుకునేవారు www.2prong.com అనే వెబ్‌సైటులోకి వెళ్ళండి. సైట్ ఓపెన్ అయిన వెంటనే ఓ ఇ-మెయిల్ అడ్రస్ మీ విండోస్ clipboardలోకి కాపీ చేయబడుతుంది. ఇక వివిధ ఫోరమ్‌స్‌లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆ మెయిల్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయ్యే ప్రాసెస్‌లో భాగంగా ఆయా ఫోరమ్‌లు activation linkలను పంపిస్తే ఆ లింకులు సైతం ఈ సైట్‌లో లభిస్తాయి ఈ సైట్ ద్వారా మనం క్రియేట్ చేసుకునే అడ్రస్‌లు ban చెయ్యబడకుండా ఉండడం కోసం ప్రతీ 48 గంటలకోసారి ఈ సైట్ తన డొమైన్ నేమ్‌ని మార్చుకుంటుంది సుమా!

1 కామెంట్‌:

Tulasi Ram Reddy చెప్పారు...

వీటినికూడా ప్రయత్నించ వచ్చు.

http://www.mailinator.com

http://email.bugmenot.com