7, సెప్టెంబర్ 2007, శుక్రవారం
ఫోన్ చేస్తున్నారా.. రేడియేషన్ బారిన పడకుండా ఉండాలంటే?
కొద్దిగా ఖరీదు ఎక్కువగా ఉండే ఫోన్ల విషయంలో పెద్దగా రేడియేషన్ సమస్య ఉండదు కానీండి, కొందరు సెల్ ఫోన్ ఆపరేటర్లు "రూ.999లకే హ్యాండ్ సెట్, దానితోపాటు 999 టాక్ టైం ఫ్రీ" అంటూ మనకు అంటగట్టే నాసిరకం ఫోన్లలో గంటల తరబడి మాట్లాడేటప్పుడు మాత్రం రేడియేషన్ బారిన పడడం ఖాయం. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే నాసిరకం ఫోన్లకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ మీ సన్నిహితులు అందరూ ఒక ప్యాకేజ్ గా అదే నాసిరకం ఫోన్ ని కొనుగోలు చేసినట్లయితే, ఇక మీ చేతుల్లో ఉన్నదల్లా వీలైనంత తక్కువగా ఆ ఫోన్ లో మాట్లాడడం! ప్రతీ కాల్ నీ అవసరం మేరకే మాట్లాడి క్లుప్తంగా ముగించండి. అలాగే నెంబర్ ని డయల్ చేసి వెంటనే ఫోన్ ని చెవికి ఆనించుకోవద్దు. కాల్ కనెక్ట్ అయ్యేటంత వరకూ వెయిట్ చేసి అప్పుడే చెవికి ఆనించండి. ఈ జాగ్రత్తని అందరు ఫోన్ వినియోగదారులు పాటించడం ఉత్తమం. కాల్ కనెక్ట్ అయ్యే సమయంలో ఎక్కువ మొత్తంలో రేడియేషన్ వెలువడుతుంది. అలాగే అద్దాలు మూసేసిన కార్లు, లిఫ్ట్లులు వంటి ప్రదేశాల్లో తప్పనిసరి అయితేనే ఫోన్ ని వాడండి. జేబులు, బెల్ట్ల్ లకు ఫోన్లని అమర్చడం కన్నా వీలైతే చేతుల్లో ఉంచుకోండి. డెస్క్ వద్ద ఉన్నప్పుడు జేబులో నుండి తీసేసి డెస్క్ పై ఉంచుకోవడం ఉత్తమం.
2 కామెంట్‌లు:
ఏ సెల్ నుంచి ఎంత Radiation వస్తుందో ఎలా తెలుసుకోవడం? Radiation levels లో Safe limits గురించి వివరిస్తే పాఠకులకు ఉపయోగకరంగా, మార్గదర్శిని గా ఉండగలదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి