21, ఏప్రిల్ 2014, సోమవారం

మీ Facebook, Dropbox అకౌంట్ల పర్మిషన్లు వేరే అప్లికేషన్లకి ఇచ్చారా.. ఇది ఫాలో అవండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8HmoM4cjXW8

కొన్నిసార్లు మనం మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే కొన్ని అప్లికేషన్లూ, అలాగే కొన్ని రకాల వెబ్‌సైట్లూ మన Facebook, Google, Dropbox, Linkedin వంటి వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ ప్రొఫైళ్లని యాక్సెస్ చెయ్యడానికి పర్మిషన్లు కేటాయించమని మనల్ని కోరుతుంటాయి. మనం వెనుకాముందూ ఆలోచించకుండా అలా పర్మిషన్లు ఇచ్చేస్తుంటాం.. తర్వాత మర్చిపోతుంటాం.

అయితే ఆ అప్లికేషన్లని వాడడం మానేసిన తర్వాత కూడా ఆ అప్లికేషన్లు మన Facebook ఇతర అకౌంట్లలోని మన పేరు, మెయిల్ ఐడిలు, ఫ్రెండ్ లిస్ట్, ఫొటోలూ, ఫైళ్లూ వంటి అన్ని రకాల డేటానీ వాడేసుకోవడం కరెక్ట్ కాదు కదా?

సో ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ మీరు వివిధ అప్లికేషన్లకి ఏయే పర్మిషన్లు ఇచ్చారో ఓ చోట చూడగలిగితే, అవసరం లేని వాటిని తొలగించగలిగితే బాగుంటుంది కదా? మీకు ఇప్పుడు సమస్య తీవ్రత అర్థమైతే ఈ వీడియో చూడండి.. దీనిలో నేను చూపించినట్లు చేయడం ద్వారా మీ అకౌంట్ డేటా అనవసరమైన చోట దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8HmoM4cjXW8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: