29, ఆగస్టు 2014, శుక్రవారం

క్వాలిటీగా Selfieలు షూట్ చేసుకోవాలా? అయితే ఈ టెక్నిక్ ఫాలో అవండి.. ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=i9Yjpgd7sgY

చాలామంది ఫోన్ స్క్రీన్ మీద తాము ఎలా కన్పిస్తున్నామో ప్రివ్యూ చూసుకుంటూ Front Cameraతో సెల్ఫీలు కేప్చర్ చేసుకుంటూ ఉంటారు. అయితే Front Camera చాలా తక్కువ పిక్సెళ్ల రిజల్యూషన్ ఉండడం వల్ల ఫొటోలు అంత క్వాలిటీగా రావు.

అలాగని హై రిజల్యూషన్ ఉండే back camera వాడదామంటే తాము ఎలా కన్పిస్తున్నామో ప్రివ్యూ కన్పించకపోవడం వల్ల చాలామంది అస్సలు back camera జోలికే వెళ్లరు. ఈ నేపధ్యంలో నేను ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే ప్రివ్యూ మీకు కన్పించకపోయినా back camera సాయంతో అద్భుతమైన సెల్ఫీ ఫొటోల్ని కేప్చర్ చేసుకోవచ్చు.

మీరు సరిగ్గా నిలబడి లేకపోతే, తలని తిన్నగా పెట్టి లేకపోతే left, right కొద్దిగా మూవ్ చెయ్యమని ఫోనే వాయిస్ డైరెక్షన్లు కూడా ఇస్తుంది. సో ఈ అద్భుతమైన టెక్నిక్‌ని ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=i9Yjpgd7sgY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: