31, ఆగస్టు 2014, ఆదివారం

మీ ఫోన్ నిండిపోతోందా? ఏది ఎంత space తినేస్తోందో గ్రాఫ్ రూపంలో ఇలా తెలుసుకోండి.. ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UMWX4lmoGHs

ఆండ్రాయిడ్ ఫోన్లలో అప్లికేషన్లు, గేమ్స్ ఇన్‌స్టాల్ చేసే కొద్దీ, ఫొటోలు తీసే కొద్దీ స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. దీంతో ఫోన్ చాలా స్లో అవుతుంది.

ఉన్న ఫళంగా ఫోన్‌ని మళ్లీ స్పీడ్ చేసుకోవాలంటే ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోనూ, మెమరీ కార్డులోనూ ఏయే అంశాలు ఎంతెంత స్పేస్ ఆక్రమించాయన్న వివరాలు తెలిస్తే వాటిలో అవసరం లేని వాటిని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో ఇలా space usageని తెలుసుకునే అవకాశం settingsలో ఉన్నా.. అది అంత వివరంగా వివరాలు తెలియజేయదు.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా ఏయే ఫోల్డర్లు, ఫైళ్లు, అప్లికేషన్లు ఎంతెంత స్పేస్ ఆక్రమించుకున్నాయో చాలా వివరంగా గ్రాఫ్ రూపంలో తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UMWX4lmoGHs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

మీ Gmail, Facebook 2 స్టెప్ కోడ్‌లు ఫోన్‌కి సకాలంలో రావట్లేదా? ఆ కోడ్ల కోసం Google Authenticator ఇలా వాడొచ్చు.. ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ft_H8gHi-Zc

మన Gmail, Facebook అకౌంట్లని ఇతరులు హ్యాక్ చేయకుండా ఉండడం కోసం మన ఫోన్‌కి one time password వచ్చేలా Gmailలోనూ, Facebookలో 2-Step వెరిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో గతంలో చూపించాను కదా.

సో మీరు ఇలా సెట్ చేసుకున్నాక మీ ఫోన్‌కి సిగ్నల్ లేకపోవడం వల్ల SMS రాలేదనుకుందాం. అలాంటప్పుడు మీ Gmail, Facebook అకౌంట్లలోకి లాగిన్ కాలేరు కదా. ఇలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండడం కోసం మీ Android, iPhoneలలో Google Authenticator ద్వారా మీ అకౌంట్లకి కావలసిన కోడ్‌లు ఎప్పటికప్పుడు ఫోన్ సిగ్నల్ లేకపోయినా పొందడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

Gmail, Facebook అకౌంట్లని రక్షించుకోవడానికి 2-Step Verification వాడే ప్రతీ ఒక్కరూ ఈ టెక్నిక్ తప్పనిసరిగా ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ft_H8gHi-Zc

Facebookకి 2-Step వెరిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేయాలో ఇక్కడ చూడొచ్చు: https://www.youtube.com/watch?v=U56FefQSG-s

Gmailకి 2-Step వెరిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేయాలో ఇక్కడ చూడొచ్చు: https://www.youtube.com/watch?v=jP0Uw8g6Pw0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

30, ఆగస్టు 2014, శనివారం

Facebook News Feedలో మీ Friendsవి అన్ని Updates చూపించదు.. అన్నీ చూపించబడాలంటే ఇలా చేయండి.. ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=r8pvb_s20xI

Facebookలో News Feedలో మనకు అందరు ఫ్రెండ్స్, రెలెటివ్స్ updates వస్తున్నాయన్న భ్రమలో ఉంటాం గానీ Facebook ఫిల్టరింగ్ సిస్టమ్ చాలా updatesని మనకు చూపించదు.

ఈ నేపధ్యంలో మనకు ఇష్టమైన, బాగా ముఖ్యమైన friends, relatives పోస్ట్ చేసే updatesని మిస్ అవకుండా పొందాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్‌ని ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=r8pvb_s20xI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

29, ఆగస్టు 2014, శుక్రవారం

మీ ఫోన్లో WhatsApp మెసేజ్ వస్తే అది మీ పిసి స్క్రీన్‌పైకి కావాలా?.. ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wmJ2HV9VxkA

మీ ఫోన్ ఎక్కడో పడేసి మీ పిసి/లాప్‌టాప్ మీద పనిచేస్తున్నారనుకుందాం. మీ ఫ్రెండ్స్ WhatsAppలో మెసేజ్‌లు పంపిస్తే ఆ నోటిఫికేషన్ మీ లాప్‌టాప్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారా.. అంతే కాదు మీకు ఏదైనా కాల్ వచ్చినా, sms వచ్చినా ఆ విషయం మీ పిసి స్క్రీన్ మీద నోటిఫై చెయ్యబడాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.

అంతేనా.. ఇంకా చాలానే విశేషాలు ఉన్నాయి ఈ వీడియోలో. ఏదైనా వెబ్ సైట్ అడ్రస్‌ని మీ పిసి నుండి ఫోన్‌కి పంపించొచ్చు, పిసిలో ఉన్న ఫొటోల్ని వైర్‌లెస్‌గా ఫోన్‌లోకి పంపొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wmJ2HV9VxkA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

"మీలో ఎవరు కోటీశ్వరులు" పార్టిసిపెంట్స్‌లా మీ జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారా?.. ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pMBzDdO8z48

సివిల్స్, Group 1, Group 2 వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు మొదలుకుని రకరకాల క్విజ్ కాంపిటీషన్లు, గేమ్ షోలకు ట్రై చేసే వాళ్లూ, సరదాకి బ్రెయిన్‌కి పదును పెట్టాలనుకునే వాళ్లు వివిధ రంగాలకు సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ వెదికి పట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.

ఈ నేపధ్యంలో నేను ఈ వీడియోలో చూపిస్తున్న మెథడ్ ఫాలో అయితే 590కి పైగా టాపిక్స్ గురించి 5 లక్షలకు పైగా ప్రశ్నలతో కూడిన క్విజ్ రౌండ్లని మీరే మీ ఫోన్‌లో పూర్తి చేయొచ్చు. క్విజ్‌లో పాల్గొనే ప్రతీసారీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో పోటీదారుడు మీతో పాటు పోటీలో పాల్గొని మీకు పోటీ ఇస్తుంటారు. సో మీరు ఎంత వేగంగా క్వశ్చన్లకు ఆన్సర్ చెయ్యగలుగుతున్నారో కూడా అర్థమవుతుంది.

చాలా ఇంట్రెస్టింగ్‌గానూ, ఛాలెంజింగ్‌గానూ ఉండే దీన్ని మీరూ ట్రై చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pMBzDdO8z48

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

క్వాలిటీగా Selfieలు షూట్ చేసుకోవాలా? అయితే ఈ టెక్నిక్ ఫాలో అవండి.. ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=i9Yjpgd7sgY

చాలామంది ఫోన్ స్క్రీన్ మీద తాము ఎలా కన్పిస్తున్నామో ప్రివ్యూ చూసుకుంటూ Front Cameraతో సెల్ఫీలు కేప్చర్ చేసుకుంటూ ఉంటారు. అయితే Front Camera చాలా తక్కువ పిక్సెళ్ల రిజల్యూషన్ ఉండడం వల్ల ఫొటోలు అంత క్వాలిటీగా రావు.

అలాగని హై రిజల్యూషన్ ఉండే back camera వాడదామంటే తాము ఎలా కన్పిస్తున్నామో ప్రివ్యూ కన్పించకపోవడం వల్ల చాలామంది అస్సలు back camera జోలికే వెళ్లరు. ఈ నేపధ్యంలో నేను ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే ప్రివ్యూ మీకు కన్పించకపోయినా back camera సాయంతో అద్భుతమైన సెల్ఫీ ఫొటోల్ని కేప్చర్ చేసుకోవచ్చు.

మీరు సరిగ్గా నిలబడి లేకపోతే, తలని తిన్నగా పెట్టి లేకపోతే left, right కొద్దిగా మూవ్ చెయ్యమని ఫోనే వాయిస్ డైరెక్షన్లు కూడా ఇస్తుంది. సో ఈ అద్భుతమైన టెక్నిక్‌ని ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=i9Yjpgd7sgY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

28, ఆగస్టు 2014, గురువారం

మీ ఫోన్‌లో Gallery/Photos స్లోగా ఓపెన్ అవుతోందా? ఇది ట్రై చేయండి! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=5-mmPdckRLg

సహజంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే Gallery అప్లికేషన్ ద్వారా మనం కెమెరాతో తీసిన ఫొటోలూ, పిసి ద్వారా ఫోన్‌లోకి కాపీ చేసుకున్న ఫొటోలూ, ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న ఫొటోలూ చూస్తుంటాం కదా.

అయితే ఫోన్‌లో భారీ సంఖ్యలో ఫొటోలు ఉన్నప్పుడు Gallery/Photos అప్లికేషన్ ఓపెన్ అవడం చాలా స్లో అవుతుంది. అలాగే ఒక ఫోల్డర్ నుండి మరో ఫోల్డర్‌లో ఉన్న ఫొటోలకు మారడం కూడా కష్టమవుతుంది.

ఈ నేపధ్యంలో మీ ఫోన్‌లో ఎన్ని వందల ఫొటోలు ఉన్నా చాలా వేగంగా క్షణాల్లో కావలసిన ఫొటోని ఓపెన్ చేసుకునే ఓ అద్భుతమైన టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=5-mmPdckRLg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

25, ఆగస్టు 2014, సోమవారం

మీ Desktop కంప్యూటర్‌కి Wi-Fi ఫెసిలిటీ పొందడం ఇలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nfxWPzA6XG0

లాప్‌టాప్‌లలో అంటే డీఫాల్ట్‌గా WiFi ఉంటుంది.. సో దాన్ని ఆన్ చేసుకుని ఏ రూటర్‌కైనా కనెక్ట్ అయిపోవచ్చు.. అదే మామూలు డెస్క్‌టాప్ కంప్యూటర్లలో Wi-Fi ఉండదు కదా.

అలాంటప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్‌కి వైఫై ఫెసిలిటీ పొందడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.  చాలామంది డెస్క్‌టాప్ యూజర్లకి ఇలాంటి సదుపాయం ఉందన్న విషయమే తెలీదు. సో వీడియో చూసేయండి మరి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nfxWPzA6XG0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్లో Apps వాటంతట అవే Update అవుతూ ఫోన్ స్టోరేజ్ తగ్గిపోతోందా?Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RkicV1suktw

ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం ఇన్‌స్టాల్ చేసుకునే అనేక అప్లికేషన్లు నెట్ కనెక్షన్ ఆన్ చెయ్యగానే వాటంతట అవే update అవుతూ ఓ పక్క నెట్ బ్యాలెన్స్ హరించడంతో పాటు మరో పక్క విలువైన ఇంటర్నల్ స్టోరేజ్‌ని మరింత తగ్గించేస్తుంటాయి.

మనం రెగ్యులర్‌గా వాడే అప్లికేషన్లని మాత్రమే, మనకు బాగా అవసరం అయినవి మాత్రమే మనకు మనం స్వయంగా update చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంటర్నల్ స్టోరేజ్ క్రమేపీ నిండిపోతుంటుంది.

ఈ నేపధ్యంలో మీకు తెలీకుండానే వాటంతట అవి update అయ్యే అప్లికేషన్లని auto update అవకుండా డిసేబుల్ చేయడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. ఇంటర్నల్ మెమరీ, నెట్ యూసేజ్‌లు వేస్ట్ అవుతున్నాయని భావించే వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RkicV1suktw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

24, ఆగస్టు 2014, ఆదివారం

మీ పిల్లల ఫోన్‌ని ఇలా కంట్రోల్ చేయొచ్చు....! Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=loKw-OsGVM0

పిల్లలు గొడవ చేస్తున్నారని చాలామంది ఈ మధ్య ఫోన్లు కొనిపెడుతూ ఉన్నారు. దాంతో పిల్లలు స్టడీస్ వంటివన్నీ పక్కన పెట్టేసి గంటల తరబడి ఫోన్ గేమ్స్ వంటి వాటితో గడిపేస్తున్నారు.

ఈ నేపధ్యంలో మీరు ఆఫీసులో ఉన్నా మీ ఇంట్లో ఉన్న పిల్లల ఫోన్‌ని లాక్ చేయడం, ఓ టైమ్ సెట్ చేసి ఆ టైమ్‌లోనే ఫోన్ పనిచేసేలా చేయడం, వాళ్లేం అప్లికేషన్లు, గేమ్‌లు డౌన్‌లోడ్ చేస్తున్నారో గమనించడం, వాళ్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో లొకేషన్‌తో సహా చూడడం వంటివి కావాలంటే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా చూపించిన ప్రొసీజర్ ఫాలో అవండి.

చిన్న పిల్లలు, మధ్య వయస్సు పిల్లలు ఉన్న ఇళ్లల్లో వాళ్ల చదువులు పాడవకుండా కాపాడడానికి ఈ టెక్నిక్ చాలా పనికొస్తుంది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=loKw-OsGVM0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో సూపర్ ఫాస్ట్‌గా టైప్ చేయడం ఇలా..! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PKb-1f5JQ74

ఆండ్రాయిడ్ ఫోన్లలో sms, whatsapp ఛాటింగ్, facebook updates వంటివి చేసేటప్పుడూ, ఏదైనా డాక్యుమెంట్లు టైప్ చేసేటప్పుడూ అక్షరాలు వెదుక్కుంటూ టైప్ చేయాల్సి వస్తోందా?

అయితే ఈ వీడియోలో చూపించిన అత్యంత శక్తివంతమైన కీబోర్డ్ గనుక మీరు వాడడం మొదలెడితే టైపింగ్ కష్టాలు ఈజీగా తీరిపోతాయి. సో మీరూ ప్రయత్నించండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PKb-1f5JQ74

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

23, ఆగస్టు 2014, శనివారం

మీ దగ్గర ఉన్న పాటలు తక్కువ సౌండ్‌తో ఉన్నాయా? ఇలా 50 Times వరకూ సౌండ్ పెంచుకోండి! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ms-Ag0ofjec

పాతవీ, కొత్తవీ కొన్ని పాటలు చాలా తక్కువ సౌండ్‌తో ఉంటుంటాయి. కంప్యూటర్లోనూ, ఫోన్‌లోనూ ఎంత volume పెంచుకున్నా స్పష్టంగా విన్పించక ఇబ్బంది పడాల్సి వస్తుంది.

మీరూ MP3 పాటల విషయంలో ఇలాంటి ప్రాబ్లెం ఫేస్ చేస్తున్నట్లయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా 3x, 5, x, 15, 20, 50x వరకూ భారీగా సౌండ్‌ని పెంచుకోవచ్చు. సరిగ్గా విన్పించని పాటల్ని చాలా బెటర్‌గా వినేయొచ్చు. సో ట్రై చేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ms-Ag0ofjec

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu