భారీ పరిమాణం గల వీడియో ఫైళ్ళని సైతం సాధ్యమైనంత వరకూ నాణ్యత లోపించకుండా తక్కువ పరిమాణంలోకి కంప్రెస్ చెయ్యడానికి DivX అనే వీడియో కోడెక్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. AVI, MPEG, WMV వంటి అన్ని రకాల ఫైల్ ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళని ఈ DivX ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో ఫైళ్ళని DivX ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయ్యడానికి అనేక సాఫ్ట్‌వేర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నా DivX Converter 6.5 వెర్షన్ అన్నింటికన్నా మెరుగైన ఫలితాలను అందిస్తోంది. MPG, VOB, TS, SVCD ఫైళ్ళని DivX ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ కన్వర్టర్ సాఫ్ట్‌వేర్‌కి అదనంగా MPEG-2/DVD ప్లగ్ ఇన్ కూడా అవసరం అవుతుంది. వేర్వేరు వీడియో ఫైళ్ళని ఒకే DivX ఫైల్‌గా మెర్జ్ చేయడానికి కూడా ఇది పనికొస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి