మన కంప్యూటర్ యొక్క మదర్‌బోర్డ్‌పై CMOS బ్యాటరీ అని ఒక బ్యాటరీ పొందుపరచబడి ఉంటుంది. అది BIOS ప్రోగ్రామ్‌లో మనం చేసే సెట్టింగులను సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది.అయితే CMOS బ్యాటరీ వీక్ అయినప్పుడు ప్రస్తుతం ఉన్న హార్డ్‌వేర్ సెట్టింగులు సేవ్ చేయబడక.. డీ్‌ఫాల్ట్ సెట్టింగులకూ, ప్రస్తుతం సిస్టమ్‌లో కనిపించే సెట్టింగులకు (RAM, హార్డ్ డిస్క్, సిడిరామ్ డ్రైవ్‌ల వివరాలు వంటివి) మధ్య వౄత్యాసం కన్పించి కంప్యూటర్‌ని బూట్ చేసే సమయంలో Press F1 to continue మాదిరిగా మెసేజ్ చూపించబడుతుంటుంది. అలాంటప్పుడు ఓ సారి కేబినెట్‌ని విప్పదీసి మదర్‌బోర్డ్‌పై mount చేయబడి ఉండే బ్యాటరీని తొలగించి బయట ఎలక్ట్రానిక్ షాపుల్లో అదే తరహా బ్యాటరీని కొనుక్కొచ్చి మదర్‌బోర్డ్‌పై అమర్చితే సరిపోతుంది. ఒకవేళ బ్యాటరీని మార్చడం ఎలాగో మీకు అవగాహన లేక అలాగే కొనసాగదలుచుకున్నట్లయితే…సిస్టమ్ బూట్ అయ్యే సమయంలో ఓసారి Del కీని ప్రెస్ చేయడం ద్వారా BIOS లోకి వెళ్ళి అందులో కనిపించే వేర్వేరు విభాగాల్లో Wait for Error పేరిట ఏదైనా ఆప్షన్ మీ BIOS వెర్షన్‌లో లభిస్తోందేమో గమనించండి. కనిపిస్తే దానిని డిసేబుల్ చేయండి. దీంతో ఇకపై ఎర్రర్ మెసేజ్ చూపించబడకుండానే నేరుగా హార్డ్‌డిస్క్ నుండి ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ చేయబడుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి