Nokia సంస్థ ఇటీవల Nokia PC Phone అనే ఓ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది.Symbian S60 శ్రేణికి చెందిన Nokia ఫోన్ మీవద్ద ఉన్నట్లయితే దాన్ని USB డేటా కేబుల్ ద్వారా గానీ, బ్లూటూత్ ద్వారా గానీ పిసికి కనెక్ట్ చేసి ఉన్నప్పుడు.. Internet Explorer, FireFox వంటి బ్రౌజర్ ద్వారా ఆ ఫోన్‌ని నియంత్రించుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ ప్రోగ్రామ్‌ని FireFox 2.x లేదా IE 7.x బ్రౌజర్ల యొక్క బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా పరిగణించవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్‌ని మీ పిసికి కనెక్ట్ చేసిన వెంటనే మీ ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఈ సాఫ్ట్‌వేర్ పిసిలోకి స్వీకరించడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే మీ ఫోన్‌లో ఇప్పటివరకు స్టోర్ చెయ్యబడి ఉన్న SMSలు, Call list లో వచ్చిన ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలు సైతం పిసిలోకి స్వీకరించబడతాయి. అలాగే SMS మేసేజ్‌లను పంపించదలుచుకున్నప్పుడు ఫోన్ యొక్క చిన్న కీ ప్యాడ్ ద్వారా ఇబ్బందులు పడే బదులు, నేరుగా పిసి యొక్క కీబోర్డ్ నుండే టైప్ చేసి మెసేజ్‌లు పంపించుకోవచ్చు. అలాగే నేరుగా మీ పిసినుండే ఫోన్ కాల్స్‌ని చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్ లిస్టులొ కొత్త మెంబర్లని జతచేయాలంటే నేరుగా పిసి నుండే సులభంగా జత చేయవచ్చు. మీ ఫోన్‌కి వచ్చిన కాల్స్‌ని, పిసి నుండే లిఫ్ట్ చేయవచ్చు. కట్ చేయనూవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి