29, నవంబర్ 2008, శనివారం

పేజింగ్ ఫైల్‍ని కూడా డీఫ్రాగ్ చేసుకోవచ్చు…


మనం భారీ మొత్తంలో అప్లికేషన్ ప్రోగ్రాములను ఉపయోగిస్తున్నప్పుడు అవన్నీ ఫిజికల్ మెమరీ (RAM) లో పట్టకపోయినట్లయితే విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్ మీద కొంత ఖాళీ ప్రదేశాన్ని తాత్కాలికంగా RAM మాదిరిగా ఉపయోగించుకుంటుంది. అలా మెమరీ మాదిరిగా ఉపయోగించబడే హార్డ్ డిస్క్ ప్రదేశాన్ని Page File అంటారని మీకు తెలిసే ఉంటుంది.కంప్యూటర్ యొక్క పనితీరు మెరుగుపరుచుకోవాలంటే ఎప్పటికప్పుడు హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేయడం ఉత్తమమని తెలిసిందే కదా! అయితే సాధారణ పద్ధతుల ద్వారా హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేసేటప్పుడు కేవలం హార్డ్ డిస్క్‌లోని ఫైళ్ళు, ఫోల్డర్లు, బూట్ సెక్టార్ వంటివి మాత్రమే ప్రభావితం చేయబడతాయి. అసలు డీఫ్రాగ్ చేయకపోవడం కన్నా ఇలా విండోస్ లోని సాధారణ Defrag ప్రోగ్రామ్ ద్వారా హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేయడం ఉత్తమమే అనుకోండి. కానీ NortonUtilities, O&O Defragmenter వంటి కొన్ని శక్తివంతమైన థర్డ్ పార్టీ డీఫ్రాగ్మెంటేషన్ ప్రోగ్రాములను ఉపయోగించి సిస్టమ్‌ని డీఫ్రాగ్ చేసుకోవడం అన్నింటి కన్నా ఉత్తమం.దీని వల్ల కేవలం హార్డ్ డిస్క్‌లోని సాధారణ భాగాలేకాకుండా ఆపరేటింగ్ సిస్టమ్‌చే page file గా ఉపయోగించబడుతున్న భాగం కూడా డీఫ్రాగ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: