Internet Explorer కన్నా స్థిరంగా పనిచేస్తుండడం మూలంగా చాలామంది పిసి యూజర్లు ఇటీవలి కాలంలో firefox బ్రౌజర్‍ని ఉపయోగిస్తున్నారు. ఫైర్‍ఫాక్స్ ని మన అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే బ్రౌజర్ ద్వారానే అన్ని పనులూ నెరవేర్చుకోగలిగేలా ఫైర్‍ఫాక్స్ విషయంలో అనేక ధర్డ్ పార్టీ ఉచిత add-on లూ లభిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే మీరు ఫైర్‍ఫాక్స్ బ్రౌజర్‍ని ఉపయోగిస్తూ, ఒకే విండోలో ఒకదాని తర్వాత ఒకటి దాదాపు ఓ పదో పన్నెండో వెబ్‍సైట్లని ఓపెన్ చేశారనుకుందాం. ఇలా ఓపెన్ చేసేటప్పుడు మనం కొత్తగా వేరే టాబ్‍లో ఓపెన్ చేసే వెబ్‍సైట్ ప్రస్తుతం ఉన్న టాబ్‍కి ప్రక్కనే కొత్త టాబ్‍లొ ఓపెనవుతుంది. ఒకవేళ ఇలా ఓపెన్ చేయబడి ఉన్న టాబ్‍లు మీకు నచ్చిన క్రమంలో అమర్చబడి లేకపోతే వాటిని ముందుకూ వెనుకకూ కూడా రీఅరేంజ్ చేసుకోవచ్చు. అదెలాగంటే ఏ టాబ్‍నైతే మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి కావలసిన దిశలో డ్రాగ్ చేయండి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి