12, ఫిబ్రవరి 2008, మంగళవారం

ఉచితంగా పోడ్‍కేస్ట్ అందిస్తున్న సర్వీసులు



ఫ్రీ ఫైల్ హోస్టింగ్, ఇమేజ్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్, వీడియో సర్వీసులు ఎలాగైతే ఇంటర్నెట్‍ని ముంచెత్తుతున్నాయో ఈ మధ్య మీ స్వంత Podcastలను ఏ మాత్రం ఖర్చు లేకుండా ఉచితంగా హోస్ట్ చెయ్యడానికి కూడా కొన్ని వెబ్‍సైట్లు ముందుకు వస్తున్నాయి. వాటిలో www.blip.TV అనే వెబ్‍సైట్ ఒకటి. దీనికి MP3 ఫైళ్లని అప్‍లోడ్ చేసుకోవచ్చు. చక్కని ఇంటర్‍ఫేస్ కలిగిన ఈ వెబ్‍సైట్ RSS feeds ని కూడా అందిస్తుంది. ఈ సైట్‍ని విజిట్ చేసిన వారు ఉచితంగా మీరు అప్‍లోడ్ చేసిన MP3 ఫైళ్ళని డౌన్‍లోడ్ చేసుకోగలుగుతారు. అలాగే www.divshare.com అనే వెబ్‍సైట్‍ని ఎంచుకోవచ్చు. ఈ వెబ్‍సైట్‍లోకి మీరు అప్‍లోడ్ చేసుకున్న MP3 ఫైళ్ళని వెబ్‍పేజిల్లోకి ఎంబెడ్ చేసుకుని మీ RSS ఫీల్‍లను విజిట్ చేసే యూజర్లు నేరుగా ఆ వెబ్‍పేజీ‍లోనే ప్లే అవగలిగే Flash MP3 Player ద్వారా, మీరు అప్‍లోడ్ చేసిన పాటలను వినగలిగే సదుపాయాన్ని ఈ వెబ్‍సైట్ కల్పిస్తోంది అన్నమాట. అంటే ఈ సైట్‍కి అప్‍లోడ్ చేసిన పాటలు అక్కడే వినవచ్చు తప్ప డౌన్‍లోడ్ చేసుకోవడానికి వీలుపడదు. ఇకపోతే www.ourmedia.org అనే వెబ్‍సైట్ అపరిమితమైన స్టోరేజ్ స్పేస్‍ని, బ్యాండ్‍విడ్త్ ని అందిస్తోంది. మీ స్వంత పోడ్‍కాస్ట్ సృష్టించుకోవడానికి ఈ వెబ్‍సైట్‍ని ఎంచుకోవచ్చు.

2 కామెంట్‌లు:

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారికి నమస్కారములు,

వీలైతె ఈ టఫా నీ విడియో రూపంలో వివరించగలరు.

మీ శిశ్యుడు,

శ్రీనివాస్ గుప్త.

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారికి నమస్కారములు,

వీలైతె ఈ టఫా నీ విడియో రూపంలో వివరించగలరు.

మీ శిశ్యుడు,

శ్రీనివాస్ గుప్త.