20, ఫిబ్రవరి 2008, బుధవారం
Read - only ఫైళ్ళుగా మారితే సేవ్ చేయడం…
హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైళ్ళని ఎప్పుడైనా నిరభ్యంతరంగా వివిధ అప్లికేషన్ ప్రోగ్రాముల ద్వారా ఓపెన్ చేసుకుని ఎడిట్/సేవ్ చేసుకోవచ్చు. అయితే హార్డ్ డిస్క్ స్పేస్ ని ఆదా చేసుకునే ఉద్దేశ్యంతో డిస్క్ లోని ఫైళ్లని సిడి రైటర్ ద్వారా సిడిల్లోకి రికార్డ్ చేసినప్పుడు ఆ ఫైళ్లని తిరిగి సిడి నుండి సిస్టమ్ లోకి కాపీ చేసుకుని ఎడిట్ చేసి సేవ్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు cannot save అని ఎర్రర్ చూపించబడుతుంది. దీనికి కారణం. CD_ROM డిస్క్ అనేది రీడ్ ఓన్లీ మెమరీ మాత్రమే. దానినుండి కాపీ చేశాం కనుకే ఆ ఫైళ్ళని సేవ్ చెయ్యలేము. ఈ నేపధ్యంలో సిడి నుండి హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకున్న వెంటనే ఫైల్‍పై రైట్‍క్లిక్ చేసి Propertiesలో Read-only ఆప్షన్‍ని డిసేబుల్ చేసుకున్న తర్వాతే ఆ ఫైల్‍ని ఎడిట్ చేయండి.
1 కామెంట్:
నాకు ఈసందేహం చాలాకాలంగా వుంది. థాంక్స్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి