17, సెప్టెంబర్ 2013, మంగళవారం

Firefox స్లో అయిందా? ఇలా స్పీడ్ చేసుకోండి!



వీడియో లింక్ ఇది: http://bit.ly/srifirefox

మొదట్లో స్పీడ్‌గానే ఉండే Firefox రాను రానూ చాలా స్లో అయిపోయి కొత్త సైట్లు లోడ్ చేస్తుంటే మరింత విసిగిస్తూ మొత్తానికే చిరాకు తెప్పిస్తోందా?

అయితే ఈ ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ Firefox వాడే ప్రతీ ఒక్కరికీ పనికొస్తుంది.

ఇది కొన్ని క్షణాల లోపు మీ బ్రౌజర్‌ని తిరిగి పూర్తి స్పీడ్‌లోకి తీసుకు వస్తుంది.

ఎక్కువ ఇంటర్నెట్ మీదే గడిపే వారికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది.

గమనిక: ప్రతీ పిసి యూజర్ కీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifirefox

 ధన్యవాదాలు

 - నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu

16, సెప్టెంబర్ 2013, సోమవారం

పనీ, చదువూ disturb అవుతోందా? ఏ సైట్ నైనా ఓ కొద్ది సమయం ఇలా బ్లాక్ చేయొచ్చు Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://bit.ly/sriblocked

10 నిముషాలు స్పెండ్ చేద్దామని వచ్చి.. గంటల తరబడి కంప్యూటర్‌ని వదిలి ఉండలేకపోతున్నారా?

 మీరు చేయాల్సిన అన్ని పనులూ పెండింగ్ పడుతున్నాయా?

మీ పిల్లలు Facebook, Google+, ఆన్ లైన్ గేమ్స్ సైట్లని ఓపెన్ చేసుకుని గంటలు గంటలు వాటితో గడిపేస్తూ స్టడీస్‌ని ఆశ్రద్ధ చేస్తున్నారా?

అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు పనికొస్తుంది.

ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే... మీరు వద్దనుకున్న సైట్లు మీరు వద్దనుకున్న టైమ్‌కీ, వారాల్లోనూ అస్సలు ఓపెన్ కావు.

దీంతో అవ్వాల్సిన అన్ని పనులూ సక్రమంగా పూర్తవుతాయి.

గమనిక: ఇంటర్నెట్‌ని శృతిమించి వాడుతూ ప్రొడక్టవిటీని కోల్పోతున్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriblocked

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in
http://youtube.com/nallamothu

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

మీ టివిలో ఇలాంటి సమస్యలు రావచ్చు.. భయపడకండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://bit.ly/sritvrepair
వేలకు వేలు ఖర్చుపెట్టి కొన్న టివి పాడైపోతే... సర్వీస్ సెంటర్ల వాళ్లు 10 వేలు, 20 వేలు అవుతుంది అని భయపెడితే.. ఏం చేయాలి?

ఇప్పుడు మనం అందరం భారీ మొత్తంలో ఖర్చుపెట్టి ఖరీదైన LCD, LED, 3D టివిలు కొంటున్నాం సరే.... కానీ వాటిలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి..అలా సమస్యలు వచ్చినప్పుడు ఆ టివిలో ఏమేం భాగాలుంటాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో మనకు తెలిసుంటే సర్వీస్ సెంటర్ వాళ్లనూ, టెక్నీషియన్‌నీ నిలదీయొచ్చు కదా!

అందుకే ఈ వీడియో మీ కోసం ప్రాక్టికల్ గా షూట్ చేసి పెడుతున్నాను.. అక్షరాలా లక్ష రూపాయల 3D టివిని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు... ఆడియో వస్తుంది కానీ, వీడియో రాదు.... మధ్య మధ్యలో కాసేపు వచ్చి పోతుంటుంది.

శాంసంగ్ సర్వీస్ సెంటర్ వాళ్లు స్క్రీన్ పోయుండొచ్చు రూ. 30 వేలు అవుతుంది అన్నారు... కానీ సమస్య అది కాదు... కెపాసిటర్ల సమస్య అనుకున్నాను అదీ కాదు...

అస్సలు పైసా ఖర్చుపెట్టకుండా ఎంత ఈజీగా సాల్వ్ అయిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

మనకు తెలీపోతే ఎవరైనా మోసం చేయొచ్చు. లక్కీగా ఓ మంచి టెక్నీషియన్ దొరికాడు కాబట్టి ఇంత ఈజీగా నాకు సాల్వ్ అయింది.

ఈ వీడియో చూస్తే మీ టివిల మీదా మీకు అవగాహన వస్తుంది.

గమనిక: టివి వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sritvrepair

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్ ఎడిటర్
 కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu