4, ఫిబ్రవరి 2008, సోమవారం

ప్రాసెసర్ ఎంత మేరకు వేడెక్కవచ్చు?


కంప్యూటర్‍ని ఆన్ చేసిన వెంటనే Delకీని ప్రెస్ చేసి BIOS లోకి వెళితే అందులో
ప్రస్తుతం ప్రాసెసర్ ఎంత ఉష్ణోగ్రతలో పనిచేస్తోందీ వివరాలు కనిపిస్తుంటాయి.
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ప్రాసెసర్లు గరిష్టంగా 75 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ
నిక్షేపంగా పనిచెయ్యగలవు. ప్రాసెసర్ Core లోని Thermal Diode
ఆధారంగా ప్రస్తుతమ్ ఉన్న టెంపరేచర్‍ని BIOS తెలియజేస్తుంటుంది. ఇతర
బెంచ్ మార్కింగ్ సాఫ్ట్ వేర్లు ప్రాసెసర్‍లోని వేరే ప్రదేశం వద్ద టెంపరేచర్ వివరాలకూ,
ధర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ల వివరాలకూ వృత్యాసం ఉంటుంది. ఏదేమైనా 75 డిగ్రీల
సెంటిగ్రేడ్ దాటినట్లయితే ప్రాసెసర్ కూలింగ్‍పై దృష్టి సారించవలసి ఉంటుంది.

నిర్దిష్ట సమయానికి క్లీన్ చేసే సాఫ్ట్ వేర్లు.


సాధారణంగా అనునిత్యం Windows>Temp ఫోల్డర్‍లోనూ, టెంపరరీ ఇంటర్నెట్
ఫైల్స్ ఫోల్డర్‍లోనూ, ఇతర ఫోల్డర్లలోనూ tmp,gid,bak వంటి ఎక్స్ టెన్షన్ నేమ్‍లతో
వృధా ఫైళ్లు క్రియేట్ అవుతుంటాయి. వాటిని ఆటోమేటిక్‍గా క్లీన్ చేయ్యడానికి ఆల్రేడీ
పలు రకాల సాఫ్ట్ వేర్లు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్లని రన్ చెయ్యవలసిన పని
లేకుండా మనం నిర్దేశించిన సమయానికి లేదా విండోస్ బూట్ అయిన ప్రతీసారీ వేస్ట్
ఫైళ్ళని గుర్తించి తొలగించే విధంగా "షెడ్యూలర్"ని కలిగిన ప్రోగ్రాములు చాలా అరుదుగా
ఉన్నాయి. అలాంటి వాటిలొ "Trash it" ఒకటి.

1, ఫిబ్రవరి 2008, శుక్రవారం

విండోస్ XP లో సులువుగా తెలుగు రాయడం...

Step 1.
Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి


Step 2.
ఇప్పుడు Control Panel లో Regional and Language Options క్లిక్ చెయ్యండి.



Step 3.
ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని ,మీ దగ్గర ఉన్న XP సిడిని insert చేసి ok మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ సిస్టమ్ రీస్టార్ట్ చేయండి.



Step 4.
www.baraha.com నుండి XP ఆపరేటింగ్ సిస్టమ్ వాడేవాళ్ళయితే baraha డౌన్‍లోడ్ చేసుకోండి. విస్టా వాడేవాళ్ళయితే baraha IME డౌన్‍లోడ్ చేసుకుని ఇన్‍స్టాల్ చేసుకోండి.



Step 5.
Desktop మీద ఉన్న బరహ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కుడివైపు క్రింద వచ్చే చిన్ని ఐకాన్ మీద మౌస్‍తో రైట్ క్లిక్ చేసి తెలుగు ను సెలెక్ట్ చేసుకోండి.



Step 6.
ఇపుడు ఎంతో సులువుగా తెలుగులో రాసుకోండి...F 11 బటన్‍తో తెలుగు > ఇంగ్లీషు, ఇంగ్లీషు > తెలుగు మార్చుకోవచ్చు.