1, ఏప్రిల్ 2008, మంగళవారం

20,000 మైలురాయిలో సాంకేతికాలు

 20000

తెలుగు బ్లాగు గూగుల్ గుంపులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక సాంకేతిక బ్లాగు ప్రారంభించమని జ్యోతక్క, సిబిరావు గారు తదితరులు ప్రోత్సహించడం, తర్వాతి పరిణామాలతో జూలై 8, 2007 ఆదివారం నాడు జరిగిన తెలుగు బ్లాగర్ల సమావేశానికి మొట్టమొదటిసారి హాజరుకావడం.. ఆ మరుసటి రోజే నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు పేరిట బ్లాగుని ప్రారంభించడం జరిగింది. సమాచారం అందించే కోవకు చెందిన బ్లాగు కావడం వల్ల రెగ్యులర్ గా వీలైనంత ఎక్కువ సమాచారం ఇద్దామని బ్లాగు మొదలుపెట్టిన రోజే నిర్ణయించుకోవడం జరిగింది.  దాని ప్రకారమే ఎవరు చదువుతున్నారు, చదవడం లేదు అన్న లెక్కలు వేసుకోకుండా తెలిసిన కొద్దిపాటి నాలెడ్జ్ ని వెనుకా ముందూ ఆలోచించకుండా పోస్ట్ చెయ్యడానికే మొగ్గుచూపడం జరిగింది. కామెంట్లు రావట్లేదు.. జనాలు చదవడం లేదు వగైరా ఫీలింగులేమీ పెట్టుకోలేదు, కారణం అవసరం ఉన్నవారికి ఏ ఒక్కరికైనా ఈ బ్లాగు ఉపయోగపడుతుంది అన్న నమ్మకం.  బ్లాగు స్థాయిని దాటి విపరీతంగా పోస్టులు చేస్తున్నారు అన్న తరహా అభిప్రాయాలు మొదటి నుండీ వస్తూనే ఉన్నాయి. నిజమే కేవలం కంటెంట్ ఉంది దాన్ని ఎలాగైనా అవసరం అయినవాళ్లకు చేరవేయాలి అనే తపనతో పోస్టులు చేసుకుంటూ వెళ్లడం జరిగింది. అందుకే 9 నెలల కాలంలో 387 పోస్టులు (సగటున నెలకు 43 పోస్టులు) బ్లాగులో జమయ్యాయి. నేను పని వత్తిడిలో ఉన్న చాలా సందర్భాల్లో పనిగట్టుకుని మరీ పోస్ట్ చేసి ఈ బ్లాగు నిరంతరాయంగా కొనసాగడంలో కీలకపాత్ర జ్యోతక్క పోషించారు, అక్క రుణం ఏ విధంగానూ తీర్చుకోలేం. మధ్యలో ఉత్సాహంగా మైకూ గట్రా పుచ్చుకుని వీడియో పోస్టులూ చేస్తే ప్రొఫెనషల్ గా ఉంటుందన్పించి ఆ ముచ్చటా తీర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బ్లాగు సగటున రోజుకి 123 విజిట్స్ తో ఈ 20వేల మైలురాయిని చేరింది.

 SNAG-0000

ఈ బ్లాగులో చాలామందికి ఉపయోగపడే పోస్టులు ఎన్ని ఉన్నాయో అతి చెత్త పోస్టులూ చాలానే ఉన్నాయి. కానీ చిన్నదైనా పెద్దదైనా.. గొప్ప విశేషం కాకపోయినా సమాచారం సమాచారమే కదా అని చిన్న చిన్న చిట్కాలను సైతం రాయడం జరిగింది. 20వేల విజిట్లకే ఇంత సోది రాస్తున్నాడేమిటి అనుకోకండి.. రంగూ రుచీ వాసనా లేని పూర్తి జడపదార్థమైన సాంకేతిక బ్లాగుకు ఈ మాత్రం ఆదరణ నాకు ఆనందాన్నే మిగుల్చుతోంది. ఈ 9 నెలల ప్రయాణంలో మొట్టికాయలు వేసి సరైన దారిలో నడిపించిన సాంకేతిక నిపుణులకు, ఆదరించిన పిసి యూజర్లకు ధన్యవాదాలు. స్వంత తమ్ముడిగా భావించి బ్లాగుని నేను బిజీగా ఉన్నప్పుడూ నడిపిస్తున్న జ్యోతక్కకు శతకోటి నమస్కారాలు. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తూ.. స్వంత గూటిని (డొమైన్)ని ఏనాడో ఏర్పాటు చేసుకున్నా ఇంకా అందులోకి బ్లాగుని మార్చలేదు, అతి త్వరలో ఆ తంతూ పూర్తి చేసి మరించి ఆకర్షణీయంగా బ్లాగుని అందిస్తానని విన్నవించుకుంటూ సెలవు.

9 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

CONGRATULATIONS !!!!!!!!!!

నిషిగంధ చెప్పారు...

కంగ్రాచ్యులేషన్స్ శ్రీధర్ గారు, జ్యోతి గారు.. చాలా రోజుల క్రితం ఫాస్ట్ గా ప్రింట్ చేయడానికి ఒక చిట్కా చెప్పారు మీరు.. అది చాలా ఉపయోగపడుతుంది నాకు.. అప్పటినించీ మీ బ్లాగ్ మీద ఓ కన్నేసి ఉంచుతాను :))

Unknown చెప్పారు...

ఇరవై వేల మైలు రాయిని అందుకున్నందుకు మీకు అభినందనలు.
ఉపయోగకరమయిన టపాలు ఇంకా ఎన్నో రాయగలరు.

అజ్ఞాత చెప్పారు...

చప్పట్లు..అభినందనలు..శుభాకాంక్షలు

-- విహారి

జ్యోతి చెప్పారు...

శ్రీధర్ మరీ ఎక్కువ చెప్పేసాడు గాని.తన పత్రికలో బ్లాగులపై వ్యాసం కోసం బ్లాగు గుంపులోకి వచ్చిన శ్రీధర్ ని పోరి, బ్లాగు మొదలెట్టేలా చేసాను. అతను చాలా బిజీగా ఉంటాడు కాబట్టి ఆ సమయాల్లో అతని పత్రికనుండి పనికొచ్చే అంశాలు టైప్ చేసి బ్లాగులో పెడుతున్నా అంతే. నా జీవితంలో నేను చేసిన మంచి పనులు రెండు అని అనుకుంటున్నాను. ఒకటి మా పిల్లలను దగ్గరుండి బాగా చదువుకునేలా చేసి మంచి ఉద్యోగాలలొ స్థిరపడేటట్టు చేసా. ఇంకోటి శ్రీధర్ చేత తెలుగులో బ్లాగు మొదలెట్టేలా చేసాను.( ఆ సమయంలోనన్ను ఎన్ని తిట్టుకున్నాడో మరి).ఇది మనందరికి చాలా ఉపయోగం కాబట్టి ఈ భాధ్యత తీసుకున్నాను. అంతే...

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు,మీ కృషి శ్లాఘనీయం.మరింత విజ్ఞాన సమాచారంతో మీరు స్వంత సైట్ మొదలుపెట్టి విజయవంతంగా నడపాలని ఆశిస్తూ...బొజ్జ వాసు

సిరిసిరిమువ్వ చెప్పారు...

అభినందనలు. మీరు మొదలుపెట్టే ప్రతి పని ఇలానే విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.

G K S Raja చెప్పారు...

sridhar, jyothi gaarlaku abhinandanalu. Nenu ee roju nunde ee blogunu upayoginchukovadam modalu pettaanu.

M.Srinivas Gupta చెప్పారు...

I wish to our blog will be reach 50000
readers soon.