ప్రతీ కంప్యూటర్ యూజర్ కీ ఖచ్చితంగా పనికొచ్చే పలు తెలుగు టెక్నికల్
వీడియోల హ్యాండ్ బుక్ ని ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
నా తెలుగు టెక్నికల్ వీడియోలను చూసేటప్పుడు ఈరోజు మీకు ఒక వీడియో ఇంట్రెస్టింగ్ అన్పించకపోవచ్చు.. రేపు "ఫలానా వీడియో ఎక్కడుంది.." అని అవసరం కొద్దీ వెదుక్కోవలసి రావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక మామూలు కంప్యూటర్ యూజర్ దగ్గర్నుండీ ప్రొఫెషనల్స్ వరకూ ఉపయోగపడే వీడియో లింకులన్నింటినీ దఫాల వారీగా ఒకేచోట అందించే ప్రయత్నమే ఈ Handbook.
మీరు ఈ క్రింది లింక్ నుండి PDF ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకుని మీ కంప్యూటర్లో జాగ్రత్తపరుచుకోవచ్చు.
PDF ఫైల్ డౌన్ లోడ్ లింకు:
http://goo.gl/TfI5d
ఆ PDF ఫైల్ లోని లింక్ ని క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ లో సంబంధిత వీడియో ఓపెన్ అవుతుంది.
అలాగే మీ సౌకర్యం కోసం కొన్ని వీడియోల లింకులను ఇక్కడా ఇదే పోస్టులో ఇస్తున్నాను.
- నల్లమోతు శ్రీధర్
కొన్ని వీడియోల లింకులు ఒకేచోట మీ సౌకర్యం కోసం:
నా తెలుగు టెక్నికల్ వీడియోలను చూసేటప్పుడు ఈరోజు మీకు ఒక వీడియో ఇంట్రెస్టింగ్ అన్పించకపోవచ్చు.. రేపు "ఫలానా వీడియో ఎక్కడుంది.." అని అవసరం కొద్దీ వెదుక్కోవలసి రావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక మామూలు కంప్యూటర్ యూజర్ దగ్గర్నుండీ ప్రొఫెషనల్స్ వరకూ ఉపయోగపడే వీడియో లింకులన్నింటినీ దఫాల వారీగా ఒకేచోట అందించే ప్రయత్నమే ఈ Handbook.
మీరు ఈ క్రింది లింక్ నుండి PDF ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకుని మీ కంప్యూటర్లో జాగ్రత్తపరుచుకోవచ్చు.
PDF ఫైల్ డౌన్ లోడ్ లింకు:
http://goo.gl/TfI5d
ఆ PDF ఫైల్ లోని లింక్ ని క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ లో సంబంధిత వీడియో ఓపెన్ అవుతుంది.
అలాగే మీ సౌకర్యం కోసం కొన్ని వీడియోల లింకులను ఇక్కడా ఇదే పోస్టులో ఇస్తున్నాను.
- నల్లమోతు శ్రీధర్
కొన్ని వీడియోల లింకులు ఒకేచోట మీ సౌకర్యం కోసం:
1. పలు సెల్ ఫోన్లని USB పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసుకునే కేబుల్ దొరుకుతోంది తెలుసా? అదీ తక్కువ ధరకే! అదెలా ఉంటుందో ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి
2. పిసి యూజర్లు కంప్యూటర్ ని
విప్పదీస్తే లోపల ఏమి పాడవుతాయో అని అస్సలు క్లీనింగే చేయరు. మీకు ఎలాంటి
భయం లేకుండా ఈజీగా మీ పిసిని క్లీన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో
చూపించాము..
3. విండోస్ మీడియా ప్లేయర్ లో
పాటలు వినేటప్పుడు మీకు నచ్చిన ఫొటోని బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చని
తెలుసా? ఆ చిన్న టెక్నిక్ ని ఇక్కడ చూసేయండి మరి.
4. చాలామంది Gmail అకౌంట్లు
హ్యాక్ అయి ఉంటున్నాయి.. అయినా ఆ విషయం తెలియకుండానే పనిచేసుకుపోతున్నారు.
ఈ నేపధ్యంలో మీ అకౌంట్ హ్యాక్ అవకుండా ఎంత పటిష్టమైన జాగ్రత్త తీసుకోవచ్చో
ఈ వీడియోలో చూడవచ్చు.
5. చీటికీ మాటికీ మీ పిసికి వైరస్
వస్తోందా? హార్డ్ వేర్ టెక్నీషియన్ కి వందలకొద్దీ వదిలిస్తున్నారా? ఈ
వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి ఇక మీ పిసికి వైరస్సే రాదు.
6. ఫొటోషాప్ లో మీ ఫొటోని మంచి
బ్యాక్ గ్రౌండ్ లో నిలబడ్డట్లు మిక్సింగ్ చేయాలనుకుంటున్నారా? మీ ఫొటోనే
కాదు.. మీ ఫ్రెండ్స్ బర్త్ డేల సమయంలో ఈ టెక్నిక్ తో వారికి మంచి గ్రీటింగూ
చేసేయొచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి..
7. BIOSలో మనం కంప్యూటర్ కి పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు, USB పోర్టులను పనిచేయకుండా చేయొచ్చు… వందలాది సెట్టింగులు అందులో లభిస్తుంటాయి. మరి వాటిని ఈజీగా వాడడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
8. మీ కంప్యూటర్ ని మీ పెన్ డ్రైవ్
సాయంతో వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చని తెలుసా? పెన్ డ్రైవ్ ని వృధాగా
పక్కన పెట్టడం మానేసి ఈ టెక్నిక్ తెలుసుకుని ఆచరించండి మరి.. పిసి అన్నా
స్పీడ్ అవుతుంది..
9. కొన్ని వైరస్ లు విండోస్ లో ఎంత
ట్రై చేసినా దాక్కునే ఉంటాయి. అలాంటప్పుడు విండోస్ బూట్ అవకముందు వాటిని
స్కాన్ చేసుకోవడం బెటర్. అదెలాగో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది.
10. మెయిల్స్ లోనూ, ఛాటింగ్ లోనూ, Word, Notepad వంటి అనేక విండోస్ ప్రోగ్రాముల్లోనూ చక్కగా తెలుగులో టైప్ చేయాలని ఉంటే.. అది ఎంత చిన్న విషయమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
11. మీ ఫోన్ కోసం కొన్న బ్లూటూత్
హెడ్ సెట్ కేవలం ఫోన్ కాల్స్ నే విన్పిస్తోందా? పాటలూ, సినిమాల్లోని
ఆడియోనీ బ్లూటూత్ హెడ్ సెట్ లో పొందడం ఎలాగో ఈ క్రింది లింకులో చూడండి
12. కొత్తగా ఫొటోషాప్
నేర్చుకుంటున్నారా? లేదా ఇప్పటికే కొంత వచ్చా? ఈ వీడియోలో చూపిస్తున్న
రెండు మంచి టెక్నిక్ లు ఇకపై మీకు మరింత యూజ్ ఫుల్ గా ఉంటాయి మీరే చూడండి
13. కొన్ని ఫైల్ పేర్లు బ్లూ కలర్
లో కన్పిస్తుంటాయి. ఇలా కన్పిస్తోందంటే వైరస్సా? ఏమైనా సిస్టమ్ లో
ప్రాబ్లెం ఉందా? అస్సలు ఎందుకు ఇలా కన్పిస్తాయో ఇక్కడ తెలుసుకోండి
14. మీ ఇంట్లో పిల్లలు గంటల తరబడి
ఛాటింగ్, మెయిల్స్, ఫేస్ బుక్ వంటి వాటికి అతుక్కుపోతున్నారా? లేదా మీరు
ఏవైనా ఇతర వెబ్ సైట్లని బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే చాలా చిన్న
టెక్నిక్ తో అవసరం లేని సైట్లని బ్లాక్ చేసుకోవడం ఇక్కడ చూడండి
15. సెల్ ఫోన్ లోనూ తెలుగు
చూడొచ్చు, తెలుగులో టైప్ చేసుకోవచ్చని తెలుసా? ఆశ్చర్యపోకండి.. స్వయంగా
మీరే ఈ వీడియోలో చూడండి.. మీరూ మరో 10 మందికి చెప్తారు..
16. మీ టివికి ఉన్న డివిడి ప్లేయర్
లో అన్ని వీడియోలూ ప్లే అవడం లేదా? మీ పిసిలో ప్లే అయ్యే అన్ని వీడియోలూ
టివిలోనూ ప్లే అయ్యే విధంగా మార్చుకోవడం ఎలాగో ఇక్కడ చూసేయండి, ఇక మీ
ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది.
17. సెల్ ఫోన్ రీఛార్జ్
చేయించుకోవడానికి కష్టపడి షాపుల చుట్టూ తిరగడం ఎందుకు? ఇక్కడ అద్భుతమైన
పద్ధతిని చూపించాం.. ఇకపై దీన్ని ఫాలో అయిపొండి.. రీఛార్జ్ ఎప్పుడైనా మీరే
చేసుకోవచ్చు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి