3, డిసెంబర్ 2011, శనివారం

మీ పెన్ డ్రైవ్ స్పీడ్ తెలుసా? తెలియకపోతే వెంటనే ఇలా తెలుసుకోండి

వీలైనంత ఎక్కువ డేటా store చేసుకోవడం కోసం చాలామంది 2 GB, 4 GB, 8GB, 16 GB పెన్ డ్రైవ్ లు వాడుతూ ఉన్నారు. ఎక్కువ కెపాసిటీ ఉన్న పెన్ డ్రైవ్ లు అయితే కొంటున్నారు కానీ వాటిల్లోకి డేటా చాలా స్లోగా కాపీ అవుతోందనీ, ఎందుకిలా జరుగుతోందో అర్థం కావట్లేదని కంప్లయింట్లు చేస్తుంటారు.

నిజమే ముచ్చటపడి GBల కొద్దీ స్టోరేజ్ ఉన్న పెన్ డ్రైవ్ లు కొన్నప్పుడు అవి స్పీడ్ గా పనిచేయకపోతే ఎవరికైనా చిరాకు వస్తుంది. అసలింతకీ మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఎంత ఎక్కువ స్పీడ్ తో డేటాని రీడ్ చేయగలుగుతుంది, ఎంత స్పీడ్ తో రైట్ చేయగలుగుతోందీ అన్నది తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా?

ఇంతవరకూ ఈ ఆలోచనే మీకు రాకపోతే వెంటనే ఈ వీడియోలో చూపించిన విధంగా మీ పెన్ డ్రైవ్ స్పీడ్ లను తెలుసుకోండి.

  

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/AtVQq

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.
<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/wCU3XkNPmDs" frameborder="0" allowfullscreen></iframe>

24, నవంబర్ 2011, గురువారం

అనేక తెలుగు టెక్నికల్ వీడియోల హ్యాండ్ బుక్ ఇదిగోండి..

ప్రతీ కంప్యూటర్ యూజర్ కీ ఖచ్చితంగా పనికొచ్చే పలు తెలుగు టెక్నికల్ వీడియోల హ్యాండ్ బుక్ ని ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
నా తెలుగు టెక్నికల్ వీడియోలను చూసేటప్పుడు ఈరోజు మీకు ఒక వీడియో ఇంట్రెస్టింగ్ అన్పించకపోవచ్చు.. రేపు "ఫలానా వీడియో ఎక్కడుంది.." అని అవసరం కొద్దీ వెదుక్కోవలసి రావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక మామూలు కంప్యూటర్ యూజర్ దగ్గర్నుండీ ప్రొఫెషనల్స్ వరకూ ఉపయోగపడే వీడియో లింకులన్నింటినీ దఫాల వారీగా ఒకేచోట అందించే ప్రయత్నమే ఈ Handbook.
మీరు ఈ క్రింది లింక్ నుండి PDF ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకుని మీ కంప్యూటర్లో జాగ్రత్తపరుచుకోవచ్చు.

PDF ఫైల్ డౌన్ లోడ్ లింకు:
http://goo.gl/TfI5d

ఆ PDF ఫైల్ లోని లింక్ ని క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ లో సంబంధిత  వీడియో ఓపెన్ అవుతుంది.
అలాగే మీ సౌకర్యం కోసం కొన్ని వీడియోల లింకులను ఇక్కడా ఇదే పోస్టులో ఇస్తున్నాను.
- నల్లమోతు శ్రీధర్

కొన్ని వీడియోల లింకులు ఒకేచోట మీ సౌకర్యం కోసం:
1.      పలు సెల్ ఫోన్లని USB పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసుకునే కేబుల్ దొరుకుతోంది తెలుసా? అదీ తక్కువ ధరకే! అదెలా ఉంటుందో ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి

2.      పిసి యూజర్లు కంప్యూటర్ ని విప్పదీస్తే లోపల ఏమి పాడవుతాయో అని అస్సలు క్లీనింగే చేయరు. మీకు ఎలాంటి భయం లేకుండా ఈజీగా మీ పిసిని క్లీన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాము..
           http://goo.gl/ZdUpd
3.      విండోస్ మీడియా ప్లేయర్ లో పాటలు వినేటప్పుడు మీకు నచ్చిన ఫొటోని బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చని తెలుసా? ఆ చిన్న టెక్నిక్ ని ఇక్కడ చూసేయండి మరి.
           http://goo.gl/IeAZS
4.      చాలామంది Gmail అకౌంట్లు హ్యాక్ అయి ఉంటున్నాయి.. అయినా ఆ విషయం తెలియకుండానే పనిచేసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో మీ అకౌంట్ హ్యాక్ అవకుండా ఎంత పటిష్టమైన జాగ్రత్త తీసుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చు.
           http://goo.gl/h5WDj
5.      చీటికీ మాటికీ మీ పిసికి వైరస్ వస్తోందా? హార్డ్ వేర్ టెక్నీషియన్ కి వందలకొద్దీ వదిలిస్తున్నారా? ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి ఇక మీ పిసికి వైరస్సే రాదు.
6.      ఫొటోషాప్ లో మీ ఫొటోని మంచి బ్యాక్ గ్రౌండ్ లో నిలబడ్డట్లు మిక్సింగ్ చేయాలనుకుంటున్నారా? మీ ఫొటోనే కాదు.. మీ ఫ్రెండ్స్ బర్త్ డేల సమయంలో ఈ టెక్నిక్ తో వారికి మంచి గ్రీటింగూ చేసేయొచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి..


7.      BIOSలో మనం కంప్యూటర్ కి పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు, USB పోర్టులను పనిచేయకుండా చేయొచ్చు… వందలాది సెట్టింగులు అందులో లభిస్తుంటాయి. మరి వాటిని ఈజీగా వాడడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

8.      మీ కంప్యూటర్ ని మీ పెన్ డ్రైవ్ సాయంతో వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చని తెలుసా? పెన్ డ్రైవ్ ని వృధాగా పక్కన పెట్టడం మానేసి ఈ టెక్నిక్ తెలుసుకుని ఆచరించండి మరి.. పిసి అన్నా స్పీడ్ అవుతుంది..
          http://goo.gl/5SgZH
9.      కొన్ని వైరస్ లు విండోస్ లో ఎంత ట్రై చేసినా దాక్కునే ఉంటాయి. అలాంటప్పుడు విండోస్ బూట్ అవకముందు వాటిని స్కాన్ చేసుకోవడం బెటర్. అదెలాగో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది.
10.   మెయిల్స్ లోనూ, ఛాటింగ్ లోనూ, Word, Notepad వంటి అనేక విండోస్ ప్రోగ్రాముల్లోనూ చక్కగా తెలుగులో టైప్ చేయాలని ఉంటే.. అది ఎంత చిన్న విషయమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
         http://goo.gl/JpEIE
11.   మీ ఫోన్ కోసం కొన్న బ్లూటూత్ హెడ్ సెట్ కేవలం ఫోన్ కాల్స్ నే విన్పిస్తోందా? పాటలూ, సినిమాల్లోని ఆడియోనీ బ్లూటూత్ హెడ్ సెట్ లో పొందడం ఎలాగో ఈ క్రింది లింకులో చూడండి

12.   కొత్తగా ఫొటోషాప్ నేర్చుకుంటున్నారా? లేదా ఇప్పటికే కొంత వచ్చా? ఈ వీడియోలో చూపిస్తున్న రెండు మంచి టెక్నిక్ లు ఇకపై మీకు మరింత యూజ్ ఫుల్ గా ఉంటాయి మీరే చూడండి

13.   కొన్ని ఫైల్ పేర్లు బ్లూ కలర్ లో కన్పిస్తుంటాయి. ఇలా కన్పిస్తోందంటే వైరస్సా? ఏమైనా సిస్టమ్ లో ప్రాబ్లెం ఉందా? అస్సలు ఎందుకు ఇలా కన్పిస్తాయో ఇక్కడ తెలుసుకోండి
14.   మీ ఇంట్లో పిల్లలు గంటల తరబడి ఛాటింగ్, మెయిల్స్, ఫేస్ బుక్ వంటి వాటికి అతుక్కుపోతున్నారా? లేదా మీరు ఏవైనా ఇతర వెబ్ సైట్లని బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే చాలా చిన్న టెక్నిక్ తో అవసరం లేని సైట్లని బ్లాక్ చేసుకోవడం ఇక్కడ చూడండి

15.   సెల్ ఫోన్ లోనూ తెలుగు చూడొచ్చు, తెలుగులో టైప్ చేసుకోవచ్చని తెలుసా? ఆశ్చర్యపోకండి.. స్వయంగా మీరే ఈ వీడియోలో చూడండి.. మీరూ మరో 10 మందికి చెప్తారు..

16.   మీ టివికి ఉన్న డివిడి ప్లేయర్ లో అన్ని వీడియోలూ ప్లే అవడం లేదా? మీ పిసిలో ప్లే అయ్యే అన్ని వీడియోలూ టివిలోనూ ప్లే అయ్యే విధంగా మార్చుకోవడం ఎలాగో ఇక్కడ చూసేయండి, ఇక మీ ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది.
        http://goo.gl/LUAjD
17.   సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి కష్టపడి షాపుల చుట్టూ తిరగడం ఎందుకు? ఇక్కడ అద్భుతమైన పద్ధతిని చూపించాం.. ఇకపై దీన్ని ఫాలో అయిపొండి.. రీఛార్జ్ ఎప్పుడైనా మీరే చేసుకోవచ్చు..

3, నవంబర్ 2011, గురువారం

పాటలు వినేటప్పుడు Windows Media Playerకి మీ ఫొటో బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకోండి ఇలా..

పాటలు వినడానికి అందరూ Windows Media Playerనే వాడుతుంటారు కదా! ఆ ప్రోగ్రామ్ కి బ్యాక్ గ్రౌండ్ గా మీ స్వంత ఫొటో కన్పిస్తుంటే ఎలాగుంటుంది?

మీకెలాగుంటుందో తెలియదు కానీ.. మీ ఫ్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Windows Media Player ప్రోగ్రామ్ కి మనకు నచ్చిన ఫొటోలను వాల్ పేపర్లుగా ఎంత ఈజీగా సెట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను.
- నల్లమోతు శ్రీధర్
 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/k0khb
 ఈ వీడియోని 3Dలోనూ చూడవచ్చు: వీడియోని ప్లే చేసేటప్పుడు ప్లేయర్ పై ఉండే 3D అనే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోని 3Dలోనూ మీరు చూడొచ్చు. తెలుగులో మొట్టమొదటి 3D ఛానెల్ అయిన http://youtube.com/nallamothu అనే దానికి మీరు Subscribe చేయొచ్చు.


వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

background for windows media player nallamothu sridhar

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

Subscribe to me on YouTube
computerera telugu magazine