5, ఏప్రిల్ 2008, శనివారం

USB ఫ్రిజ్ ఎంత ముచ్చటగా ఉందో కదా!

SNAG-0004SNAG-0005

మండువేసవి కాలం ముంగిట ఉంది.. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు వస్తుంటాయి. ఓ కోక్ బాటిల్ పిసికి అందుబాటులో chiilled గా ఉంటే ఎలా ఉంటుంది? USB ఫ్రిజ్ మీ కోరికని తీరుస్తుంది. ముచ్చటగా ఓ కోక్ టిన్ పట్టే సైజ్ లో ఉండే ఈ ఫ్రిజ్ ని మీ పిసి యొక్క USB పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకతలు:
                 

       కేవలం 5 నిముషాల్లో 8 డిగ్రీల సెంటిగ్రేడ్ కి ఉష్ణోగ్రత పడిపోతుంది.
       ఎలాంటి ప్రత్యేకమైన డివైజ్ డ్రైవర్లూ అవసరం లేదు.
        ఆపరేటింగ్ సిస్టమ్ తో సంబంధం లేకుండా అన్ని సిస్టమ్ లపై పనిచేస్తుంది. 

        365 గ్రాముల బరువు ఉంటుంది.
        ఇక ధర అంటారా.. కేవలం 1350 రూపాయలు సుమారుగా.

2 కామెంట్‌లు:

Chandu చెప్పారు...

శ్రీధర్ గారు, చాలా ముచ్చట గా ఉందండి ఈ పరికరం. ఖరీదు ఎంతొ చెప్పారు కాని ఎక్కడ దొరుకుతుందో చెప్పారు కాదు!

రామ చెప్పారు...

అయ్యా.. ఇప్పటికే కంప్యూటర్ ముందు నుంచి కదలకుండా జనాలు మన దేశం లో కూడా obese అయిపోతున్నారు అని చెబుతున్నారు. కొన్నాళ్ళు పొతే USB రైస్ కుకర్, USB డిష్ వాషర్ లు కూడా వచ్చేస్తే ఇరవైనాలుగు గంటలూ కంప్యూటర్ దగ్గరే గడిపెయ్యచ్చేమో (ఏదో అనాలి కదా అని అంటున్నాను గాని, ఈ పరికరం నాకు కూడా నచ్చిందండి) :) .