మార్చి 30వ తేదీ సమావేశ నివేదిక
స్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
హాజరైన సభ్యులు:
1. శ్రీనివాస్ (mr.Srinu ఐడితో వస్తుంటారు), మన సైట్ నిర్వహణలో ముఖ్య పాత్రధారి.
2. రుచిర శ్రీనివాస్ (ఛాదర్ ఘాట్)
3. వి. రంజన్
4. బి. పట్టాభిరాం
5. ఎస్. జాహ్నవి
6. ఎన్. విక్రమ్
7. ఎం. భాస్కర్
8. అనిల్ (వరంగల్ నుండి ఈ సమావేశం కోసమై వచ్చారు)
9. శ్రీధర్ పతి (గద్వాల నుండి హాజరయ్యారు)
10. నల్లమోతు శ్రీధర్
కిషోర్ నువ్వుశెట్టి గారు, మొగిలిచర్ల మురళీధర్ గారు.. మరికొంత మంది పనుల వత్తిడి వల్ల హాజరుకాలేకపోతున్నామని సమాచారం అందించారు.
సరిగ్గా సమావేశ సమయానికి కొద్దిపాటి చినుకులు ప్రారంభమవడంతో ఎప్పటిలా ఓపెన్ ప్లేస్ లో కూర్చోవడానికి సాహసించక చక్కని గూడుని ఎంచుకుని ఆశీనులమయ్యాం. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ సమావేశానికి నలుగురైదుగురికి మించి హాజరు కారన్న భావనతో వెళ్లినా ఒకరొకరిగా వస్తూ పదిమంది వరకూ పోగయ్యాం. చాలా తక్కువమంది హాజరు అవుతారని ముందే అన్పించడం వల్ల పూర్వపు మీటింగులలా ప్రత్యేకమైన అజెండా అంటూ పాయింట్ వైజ్ గా డ్రాఫ్ట్ చేసుకోకుండానే ఈ సమావేశానికి వెళ్లడం జరిగింది. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత సభ్యుల నుండి లభించిన ప్రోత్సాహం, పార్టిసిపేషన్, చక్కని సలహాలు చూసిన తర్వాత.. సభ్యుల రాశి తక్కువైనా వాసి తక్కువ లేదన్పించింది. చాలా ప్రొడక్టివ్ సలహాలు, సూచనలు వచ్చాయి.
ఎడమ నుండి కుడికి.. రుచిర శ్రీనివాస్, విక్రమ్, శ్రీధర్ (గద్వాల), భాస్కర్, నల్లమోతు శ్రీధర్, గోరంట్ల శ్రీనివాస్, పట్టాభిరాం బొప్పన, అనిల్
ప్రధానంగా ఐ.టి. నాలెడ్జ్ ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాపింపజెయ్యడానికి మనం చేస్తున్న కార్యకలాపాల గురించి వివరంగా అన్ని ముఖ్యమైన లింకులతో సహా ఓ సమగ్రమైన అవగాహన కల్పించే డాక్యుమెంట్ ని రూపొందించి దానిని ఫోరంలో ఒక చోట అందరికీ అందుబాటులో ఉంచడం మంచిది అనే సూచన శ్రీనివాస్ అనే సభ్యుడి నుండి వచ్చింది. తద్వారా కొత్త వ్యక్తులకు మన సేవలను పరిచయం చెయ్యడానికి ఆ డాక్యుమెంట్ ఒక్కసారి చదివించగలిగితే బెటర్ అనే చక్కని అభిప్రాయం కుదిరింది. కాలేజీ లైబ్రరీల వారు డిజిట్, చిప్ వంటి పుస్తకాలకు వందలాది రూపాయలు వెచ్చిస్తూ ఉంటారని ఒక్కసారి మన కంప్యూటర్ ఎరాని పరిచయం చేస్తే అంత కంటెంట్ ఉన్న పత్రికను వారు వదిలిపెట్టరని ఆ దిశగా ప్రయత్నాలు సాగించమని జాహ్నవి గారు, జి. శ్రీనివాస్ అనే సభ్యుల నుండి సూచనలు వచ్చాయి. దానికి గాను మన కంప్యూటర్ ఎరా యాజమాన్యం నుండి సానుకూల స్పందన కోసం ప్రయత్నిస్తాను.
ఎవరికి తెలిసిన నాలెడ్జ్ ని అది చిన్నవిషయమైనా, పెద్ద విషయమైనా ఫోరంలో ఓ ఐదు నిముషాలు వీలుచేసుకుని పోస్ట్ చేయమని హాజరైన సభ్యులందరికీ విన్నవించడం జరిగింది. అలాగే ఇంగ్లీషులో కూడా ఫోరం ప్రారంభించవచ్చు కదా అనే సూచనను రాజన్ గారు చేశారు. రెండు వేర్వేరు టెక్నికల్ ఫోరంలను రెండు భాషల్లో విభిన్నంగా నిర్వహించగలగడానికి ప్రధానంగా కమిటెడ్ సభ్యుల సహకారం చాలా అవసరం. మన టీమ్ మరింత విస్తరించిన తర్వాత కొంతమంది ఆంగ్ల ఫోరం బాధ్యతని చేపట్టడానికి అవకాశం ఉంటుందని నిర్ణయానికి రావడం జరిగింది. అలాగే రుచిర శ్రీనివాస్ గారు ఫోరంలో కొత్త ఉత్పత్తులకై ఒక విభాగాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. వివిధ ఉత్పత్తులు, వాటి టెక్నికల్ స్పెసిఫికేషన్ల గురించి ఆయన అనర్గళంగా మాట్లాడడం, ఎక్కడెక్కడో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు వద్దకు ప్రత్యేకంగా వెళ్లి బ్రోచర్లు కలెక్ట్ చేసుకురావడం అనేది ఆయన హాబీ. ఆయనతో మాట్లాడుతుంటే కంప్యూటర్ ఉత్పత్తుల పట్ల ఆయనకు గల నాలెడ్జ్ చాలామందికి ఉపయోగపడుతుంది అన్పిస్తోంది. అందుకే కొత్త ఉత్పత్తుల గురించి పోరంలో కొత్త విభాగాన్ని సృష్టించడానికి నిర్ణయించడం జరిగింది.
ఈ సమావేశంలో అనూహ్యంగా చాలా ఏక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన సభ్యుల్లో జాహ్నవి గారు ఒకరు. తను ఇంజనీరింగ్ విద్యార్థిని కావడం వల్ల.. కాలేజీల్లో కంప్యూటర్ విద్యాబోధన ఎంత థీరిటికల్ గా సాగుతుందో అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. కాలేజీల్లో లెక్చరర్లు Control Panel ఓపెన్ చేస్తే కంప్యూటర్ పాడవుతుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారని, అసలు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయితే క్షణాల్లో వైరస్ వచ్చేస్తుందని భయపెట్టేస్తారని.. తాను, తన స్నేహితులు చదువుతున్న చాలా కాలేజీల్లో ఇదే తరహా వాతావరణం నెలకొని ఉందని.. ఈ నేపధ్యంలో ముందు స్టూడెంట్లలో సెమినార్ల ద్వారా అలాంటి భయాలను పారద్రోలవలసిన అవసరం ఉందని, లేదంటే ఐ.టి. ఫీల్డ్ లో మొక్కుబడి ఉద్యోగాలు చేసే బంట్రోతులుగానే మిగిలిపోతారు తప్ప ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదని అభిప్రాయం వెలిబుచ్చడం జరిగింది. కేవలం సిలబస్ కే అధిక ప్రాధాన్యం ఇచ్చి ఐ.టి. ఆధారిత అవేర్ నెస్ ని అసలు పట్టించుకోని వైఖరి ఉన్న విద్యాసంస్థలు ఈ తరహా సెమినార్లకు ఎంతవరకూ సానుకూలంగా ఉంటాయన్నది ఆలోచించాలి, అలాగే మన ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. గద్వాల నుండి శ్రీధర్ గారు ఆ పట్టణంలో కంప్యూటర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, డిటిపి సెంటర్, వెబ్ హోస్టింగ్ వంటి అన్ని రకాల సేవలను అందిస్తున్నారు. ఆయన ఈ విషయమై స్పందిస్తూ కాలేజీలలో సెమినార్లు ప్రయత్నించడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లు మనకు బాగా సహకారం అందిస్తాయి కాబట్టి అక్కడికి వచ్చే విద్యార్థులకు అవేర్ నెస్ కల్పిస్తే మరింత బాగుంటుందని సూచించడం జరిగింది. ఒకవేళ కళాశాలల నుండి సరైన ప్రోత్సాహం లభించకపోతే ఈ ప్రత్యామ్నాయ మార్గంలోనైనా మన పని మనం చేసుకుంటూ వెళ్లవచ్చు. అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగానే మొదటి కొద్దిరోజుల పాటు విద్యార్థులపై ఎలాంటి వత్తిడి లేకుండా ఖాళీగా ఉంటారని దానిని దృష్టిలో ఉంచుకుని ఆలోపు కాలేజీ యాజమాన్యాలతో చర్చించి సెమినార్లకు అనువైన సమయం నిర్ణయించుకుంటే బాగుంటుంది అని జాహ్నవి గారు సూచించారు. ఇక్కడ ఒక ఇబ్బంది నన్ను చాలారోజులుగా వేధిస్తోంది. ఒక కళాశాలలో సెమినార్ ఇచ్చేటప్పుడు కేవలం ఫీల్డ్ నాలెడ్జ్ లేని నేనొక్కడినే పార్టిసిపేట్ చెయ్యడం కన్నా వివిధ రంగాల్లో అనుభవం ఉండీ, ఐ.టి. కంపెనీల్లో వర్క్ చేస్తున్న మిత్రులు పెద్ద మనసు చేసుకుని ఇలాంటి కార్యక్రమాల పట్ల ముందుకు వస్తే చాలామందికి అవేర్ నెస్ కల్పించినట్లు అవుతుంది, స్టూడెంట్ కి కావలసిన ప్రాపర్ గైడెన్స్ కూడా లభిస్తుంది. వివిధ ఐ.టి. కంపెనీల్లో వర్క్ చేస్తున్న అనుభవజ్ఞులు దయచేసి ఈ విషయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.
ఇకపోతే ఈ కార్యకలాపాల నిర్వహణకు గాను ఆర్థిక పరమైన తోడ్పాటు ఏ విధంగా లభించినా బాగుణ్ణు అన్న ఆలోచన ఒకటి ప్రస్తావనకు వచ్చింది. దానికిగాను google adsense వంటి వాటితోపాటు స్థానికంగా ఉండే సంస్థల నుండి నామినల్ టారిఫ్ తో చిన్న చిన్న ప్రకటనలు సేకరించి ఫోరంలో, ఛాట్ లో ప్రచురిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చింది. ఆచరణలో సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి.
గత మీటింగులతో పోలిస్తే సరిగ్గా రెండు గంటల పాటు జరిగి త్వరగా ముగింపుకు వచ్చిన మీటింగ్ ఇది. ఆ రెండు గంటల వ్యవధిలోనూ చాలా మంచి సూచనలు వచ్చాయి. ఎవరివద్దా కెమెరా లేకపోవడంతో పట్టాభిరాం గారు అప్పటికప్పుడు వాళ్లబ్బాయికి ఫోన్ చేసి ఇంటి నుండి కెమెరా తెప్పించి ఫొటోలు తీయించడం విశేషం. అదీగాక గత మీటింగ్ నుండి ఆయన కృష్ణకాంత్ పార్క్ లో టికెట్ తీసుకునే ఎంట్రెన్స్ గేట్ వద్ద మీటింగ్ ఎక్కడ జరుగుతుందో కన్ ఫ్యూజ్ అయ్యే కొత్తవారిని గైడ్ చేసేలా బానర్ ఏర్పాటు చెయ్యడం వంటి అనేక విషయాల్లో సహకారం అందిస్తున్నారు. ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చిన శ్రీధర్ (గద్వాల) గారికి, అనిల్ (వరంగల్) గారికి, సామాజిక వేత్త విక్రమ్ గారికి, విలువైన సూచనలు చేసిన జాహ్నవి గారికి, భాస్కర్, రాజన్, రుచిర శ్రీనివాస్, జి. శ్రీనివాస్ గార్లకు ధన్యవాదాలు.
కొసమెరుపు: మీటింగ్ జరిగిన రాత్రి 12 దాటకముందే రిపోర్ట్ రాయటమన్నది నేను అనుసరించే పద్ధతి. కానీ రాత్రి మీటింగ్ నుండి ఇంకా ఇంటికి చేరకముందే మన సర్వర్ డౌన్ అయినట్లు మెసేజ్ వస్తోందని మిత్రులు ఫోన్ చేయడం, అప్పటికప్పుడు సర్వర్ అప్ అయ్యేలా హోస్టింగ్ వాళ్లతో కమ్యూనికేట్ చేయడం, వారి సూచనలు అమలుపరచడానికి రాత్రి 2.30 గంటల వరకూ తెలియని వెబ్ టెక్నికల్ పారామీటర్ల గురించి మల్లగుల్లాలు పడడం వల్ల ఇంత ఆలస్యంగా రిపోర్ట్ రాయవలసి వచ్చింది.
తదుపరి హైదరాబాద్ పాఠకుల సమావేశం: ఏప్రిల్ 27, ఆదివారం, 2008న కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ వద్ద, మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది.
అలాగే ఏప్రిల్ 6వ తేదీన విజయవాడలో కంప్యూటర్ ఎరా పాఠకులు, తెలుగు బ్లాగర్ల సంయుక్త సమావేశం జరుగుతుంది. వివరాలకు: 9866369288 నెంబర్ లో సంప్రదించగలరు.
గణాంకాలు: మనం అందరం టీమ్ వర్క్ గా నిర్వహిస్తున్న ఫోరం, ఛాట్ రూమ్ లు జనవరి 5, 2008న ప్రారంభమైన రోజున Alexa ర్యాంకింగ్ లో 70 లక్షలకు పైబడి ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన సైట్ Alexa ర్యాంక్ మూడు నెలల కాలంలో 5,75,645కి చేరింది. అలాగే భారతీయ సైట్లలో 9,234 ర్యాకింగ్ తో మొదటి 10వేల సైట్ల సరసన చేరింది. అలాగే మూడు నెలల కాలంలో ఫోరంలో 1819 మంది సభ్యులు చేరారు, 1017 టాపిక్ లు, 1766 పోస్టులు చేయబడ్డాయి. అధికశాతం తెలుగులోనూ, ఆకర్షణీయంగా స్ర్కీన్ షాట్లతోనూ రూపొందించబడిన పోస్టులే! అలాగే సాంకేతిక సహాయం ఛాట్ రూమ్ ద్వారా ఇంతవరకూ 650కి పైగా జెన్యూన్ సొల్యూషన్లు అందించబడ్డాయి. సరైన నిపుణులు సమయానికి అందుబాటులో లేక అపరిష్కృతంగా ఛాట్ లో జరిగిన సంభాషణలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఐ.టి. నాలెడ్జ్ ఉన్న మిత్రులకు విన్నవించుకునేది ఒక్కటే దయచేసి కొద్ది సమయమైనా ఈ వేదికపై స్పెండ్ చేయండి. మీ నాలెడ్జ్ ఎంతోమందికి ఆసరాగా నిలుస్తుంది. గద్వాల నుండి వచ్చిన శ్రీధర్ గారు అంతదూరం నుండి రావడానికి ఒకటే కారణం చెప్పారు.. ఒకరోజు నైట్ వాళ్ల బ్రదర్ కి ఏదో టెక్నికల్ ప్రాబ్లెం ఉంటే మన ఛాట్ రూమ్ లో ఎవరో అప్పటికప్పుడు అతని సిస్టమ్ లోకి ప్రవేశించి సమస్యని పరిష్కరించారట.. అంత జెన్యూన్ సర్వీస్ కి చాలా హాపీ ఫీల్ అయి ఎలాగైనా మన టీమ్ సభ్యులను కలవాలని ఈ ప్రాజెక్ట్ లో మేమూ భాగస్వాములం అవాలని అక్కడి నుండి వచ్చాం అని చెప్పారు. మన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా చిత్తశుద్దిగా ఎంతో కొంత సమయం చేసుకుంటూ వెళితే ఇలా ఎంతోమంది తామూ ఇందులో భాగస్వాములవుతారు. సో.. ఇది మనకు సంబంధించిన వ్యవహారం కాదు అని దులిపివేసుకుని వెళ్లకుండా దయచేసి హృదయమున్న మిత్రులందరూ తమవంతు సహకారం ఈ ప్రాజెక్ట్ విషయంలో అందిస్తారని ఆశిస్తున్నాం.
- నల్లమోతు శ్రీధర్
31-3-2008, 12.09 AM.
Monday, March 31, 2008 | 0 Comments
USB కీచైన్ డ్రైవ్‌లు
ఇప్పుడు చాలామంది జేబుల్లో GB ల కొద్ది మెమరీ తిరుగుతూ ఉంటోంది. ప్రతీ ఒక్కరూ 1, 2,4, 8 GB వంటి వేర్వేరు సామర్ధ్యాల్లోని USB మెమరీ స్టిక్‌లను ఉపయోగిస్తున్నారు. ఫ్లాపీ డిస్క్‌లు, జిప్ డిస్క్‌లు, సిడిలు, డివిడిలు వంటి ఇతర పద్ధతుల కన్నా డేటాని సులభంగా ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్‌కి తీసుకువెళ్ళడానికి ఈ USB మెమరి స్టిక్‌లు అనువుగా ఉంటున్నాయి. ఇతర అన్ని రకాల ఫ్లాష్ మెమరీ కార్డుల్లోని సమాచారాన్ని కంప్యూటర్‌లోకి రీడ్ చేయాలంటె Card Reader అనే ప్రత్యేకమైన పరికరం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చేది. అయితే USB మెమరీ స్టిక్‌లకు ఈ ఇబ్బంది లేదు.

మన కంప్యూటర్ క్యాబినెట్‌పై ఉండే ఏ USB పోర్ట్ కైనా ఈ మెమరీ స్టిక్‌లను సులభంగా కనెక్ట్ చేసి అందులో ఉన్న సమాచారాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఏదైనా USB కీచైన్ డ్రైవ్‌ని మన కంప్యూటర్ యొక్క USB పోర్ట్‌కి కనెక్ట్ చేసిన వెంటనే మన హార్డ్ డిస్క్‌లోని వివిధ డ్రైవ్‌లు, సిడిరామ్, డివిడి డ్రైవ్‌లకు అదనంగా ప్రస్తుతం మనం కనెక్ట్ చేసిన USB డ్రైవ్‌కి కూడా ఓ డ్రైవ్ లెటర్ My Computer లో ప్రత్యేకంగా ప్రత్యక్షమవుతుంది. ఆ డ్రైవ్ లెటర్‌ని క్లిక్ చేయడం ద్వారా ఆ USB మెమరీ స్టిక్‌లో ఉన్న సమాచారాన్ని మనం యాక్సెస్ చేయవచ్చు. ఈ తరహా మెమరీ స్టిక్‌ల డేటా ట్రాన్స్‌ఫర్ రేట్ సెకనుకు 1MB ఉంటుంది. హార్డ్ డిస్క్‌లోని ఇతర డ్రైవ్‌లలో మాదిరిగానే ఈ USB మెమరీ స్టిక్‌లను కూడా ఫార్మేట్ చేయవచ్చు. ప్రస్తుతం 20GB వరకు వేర్వేరు స్టోరేజ్ కెపాసిటీ కలిగిన USB కీచైన్ డ్రైవ్‌లు మార్కెట్లో లభిస్తున్నాయి.
Sunday, March 30, 2008 | 0 Comments
అనధికార సైట్లలో స్క్రిప్ట్‌లు, కంట్రోళ్ళు రాకుండా..
Sunday, March 30, 2008 | 1 Comments
ఉచితంగా ఆన్ లైన్ లో నేర్చుకోండి
మీరు ఉచితంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారా.. Word, Excel వంటి ప్రాధమిక అప్లికేషన్లని ఉపయోగించడం కూడా తెలియకపోతే, డబ్బులు వృధా చేసుకుని కంఫ్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టి్‌ట్యూట్‌లలో నేర్చుకోవలసిన పనిలేదు. ఇంటర్నెట్‌పై ipic అనే వెబ్‌సైట్ పలు కంప్యూటర్ సబ్జెక్టులను ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఉచితంగా నేర్పిస్తోంది.సహజంగా పేరాల కొద్ది మేటర్‌తో కూడిన పుస్తకాలు చదివి వాటిని అర్ధం చేసుకుని నేర్చుకోవడం కష్టం కదా! దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ వెబ్‌సైట్ ప్రతీ టాపిక్‌ని ఫోటోలను చూపించడం ద్వారా సులభంగా అర్ధమయ్యేలా నేర్పిస్తోంది. Access, Excel, Publisher, Word, PowerPoint, Impress, Dreamweaver, HTML & CSS, Photoshop Elements, Fireworks, MySQL, PHP Basics, Perl Basic వంటి అనేక సబ్జెక్టులను నేర్పిస్తోంది.
Sunday, March 30, 2008 | 0 Comments
ఈరోజే రీడర్స్ మీటింగ్, తప్పక హాజరు కాగలరు
ప్రియమైన మిత్రులకు.. ఈరోజు (ఆదివారం 30వతేదీ) మధ్యాహ్నం ౩ గంటలకు పాఠకుల సమావేశం జరుగుతుంది. హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న (అమీర్ పేట సారధి స్టూడియో నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో) కృష్ణకాంత్ పార్క్ లో సమావేశమవుదాం. అలాగే సమావేశ స్థలానికి రావడం విషయంలో ఏవైనా సందేహాలుంటే 9848227008 నెంబర్ లో సంప్రదించగలరు. ౩ గంటల నుండి 5.30 గంటల వరకూ సమావేశం జరుగుతుంది. నలుగురైదుగురు వచ్చినా సమావేశం జరుగుతుంది. మంచి ఉద్దేశాలు కలిగిన వ్యక్తులు ఒకచోట కలవడమే ప్రధాన ఉద్దేశ్యం తప్ప ఎంతమంది హాజరవుతారు అన్నది కాదు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈరోజు సాయంత్రం 3 గంటలకు కృష్ణకాంత్ పార్క్ టికెట్ తీసుకునే మెయిన్ గేట్ వద్ద గుమికూడి అందరం ఒకేసారి లోపలికి వెళదాం.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా
Sunday, March 30, 2008 | 0 Comments
Stop బటన్‌కి ప్రేమ చిహ్నం కావాలా?
Saturday, March 29, 2008 | 1 Comments
Acrobat లేకుండా PDFలను ఎడిట్ చేయాలా?
PDF ఫైళ్ళని ఓపెన్ చేసి చదవడానికైతే Acrobat Reader సరిపోతుంది. కానీ, ఆయా PDF ఫైళ్ళలొ ఏవైనా మార్పులు చేయాలంటే మాత్రం Adobe Acrobat Professional అనే సాఫ్ట్ వేర్ మన దగ్గర ఉండవలసి ఉంటూంది. దానికి ప్రత్యామ్నాయంగా PDFill PDF అనే సాఫ్ట్ వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దీని సాయంతో వేర్వేరు PDF ఫైళ్ళని ఒకే ఫైల్‌గా జత చేసుకోవచ్చు. PDF ఫైళ్లలోని పేజీల యొక్క వరుస క్రమాన్ని మార్చుకోవచ్చు. PDF ఫైళ్ళలోని పేజీలను రోటేట్, క్రాప్ చేసుకోవచ్చు. ప్రతీ పేజీకి మనకు నచ్చిన విధంగా Header మరియు Footer సమాచారాన్ని జత చేసుకోవచ్చు. అలాగే PDF ఫైళ్లలోని పేజీలను JPEG, BMP వంటి ఇమేజ్ ఫైల్ ఫార్మేట్లలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. నాలుగైదు పేజీలుగా ఉన్న డాక్యుమెంట్‌లోని సమాచారం మొత్తాన్ని ఒకే పేజీలో ఇమిడిపోయేలా reformat చేయవచ్చు. అలాగే PDF ఫైళ్ళకు వాటర్ మార్క్‌లను జత చేయవచ్చు. పలు ఆప్షన్లున్నాయి.
Saturday, March 29, 2008 | 1 Comments
Welcome స్క్రీన్ చూపించబడకుండా ఉండాలంటే !
Saturday, March 29, 2008 | 0 Comments
Lime Wire ఉపయోగించడం చాలా ఈజీ..
Thursday, March 27, 2008 | 0 Comments
PDF ఫైళ్ళుగా మార్చే ఫైర్ ఫాక్స్ Add-on
మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆయా వెబ్ పేజీలను PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయడానికి ప్రస్తుతం అనేక సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటి పని తీరుకు భిన్నంగా పనిచేసే LOOP for FireFox అనే ఫైర్ ఫాక్స్ add-on విడుదల చేయబడింది. దీనిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా వెబ్ పేజీని చూసేటప్పుడు Add URL అనే బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్ పేజీ PDF ఫైల్‌గా కన్వర్డ్ చేయబడుతుంది. ఒక ప్రక్క మనం వేరే సైట్లను బ్రౌజింగ్ చేసుకుంటూనే PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయవలసిన వెబ్ పేజీల లింకుల్ని add చేసి పెడితే బ్యాక్ గ్రౌండ్‌లో అవన్నీ మనకు ఇబ్బంది కలిగించకుండా PDF ఫార్మేట్ లోకి కర్వర్ట్ చేయబడుతుంటాయి.
Thursday, March 27, 2008 | 1 Comments
అన్ని ఫోన్లపై పని చేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్
Nokia, Sony Erricsson, LG, Samsung వంటి అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన జావా సపోర్ట్ కలిగిన దాదాపు అని మోడల్ ఫోన్లపై పనిచేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అదే Nimbuz. ఈ ప్రోగ్రామ్‍ని ఫోన్‍లో ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్‍లో GPRS ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంటే Google Talk, Skype, AIM, Windows Live Messenger, ICQ వంటి వివిధ ఇన్‍స్టెంట్ మెసేజింగ్ సేవలను నేరుగా మీ ఫోన్‍లోనే యాక్సెస్ చేయవచ్చు. ఆయా సర్వీసులలో మీకు గల స్నేహితులకు ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం Yahoo Messenger ని కూడా ఈ సాఫ్ట్ వేర్ సపోర్ట్ చేస్తుంది.
Thursday, March 27, 2008 | 1 Comments
ఫైర్ ఫాక్స్ ని వేగంగా పనిచేయించడానికి..
Tuesday, March 25, 2008 | 0 Comments
DVD డిస్క్ లను బ్యాకప్ తీసుకోవడం ఎలా ?
సాధారణంగా వీడియో సిడిల్లోని వీడియో ఫైళ్ళని బ్యాకప్ తీసుకోవాలంటె సింపుల్‍గా MPEGAV అనే ఫోల్డర్‍లో గాని, లేదా సిడిలోని రూట్ ఫోల్డర్‍లోనే ఉండే .DAT ఎక్స్ టెన్షన్ నేమ్ కలిగిన ఫైల్‍ని హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకుంటే సరిపోతుంది. లేదా సిడి రైటర్ ఉన్నట్లయితే Nero వంటి సిడిరైటింగ్ సాఫ్ట్ వేర్‍ని ఉపయోగించి ఓ ఖాళీ సిడిలోకి ఒరిజినల్ సిడిలోని వీడియో ఫైళ్ళని కాపీ చేసుకోవచ్చు. ఇదే విధంగా VCD ల్లో DAT ఫైల్‍లో వీడియో డేటా ఉన్నట్లే DVD డిస్క్ లలో VOB అనే ఎక్శ్ టెన్షన్ నేమ్ కలిగిన ఫైల్‍లో డిజిటల్ ఫార్మేట్‍లో ఉన్న వీడియో డేటా స్టోర్ చేయబడి ఉంటుంది. అయితే DAT ఫైల్ మాదిరిగా ఈ ఒక్క ఫైల్‌ని హార్ద్ డిస్క్ లోకి కాపీ చేసుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. DVD ల్లోని కంటెంట్ CSS ఎన్‌కోడ్ చేయబడి ఉంటుంది. ఈ కారణం వల్ల కేవలం VOB ఫైల్ వల్ల ఉపయోగం ఉండదు. దీనికి ప్రత్యామ్నాయంగా డివిడీల్లోని డేటాని బ్యాకప్ తీసుకోవడానికి DVD Decypter వంటి థర్డ్ పార్టీ ప్రోగ్రాములను ఆశ్రయించవలసి ఉంటుంది. ఇవి డిస్క్ లను బ్యాకప్ తీస్తాయి.
Tuesday, March 25, 2008 | 1 Comments
ముచ్చటైన తెలుగు వెబ్ సైట్
Monday, March 24, 2008 | 0 Comments
ఫైర్ ఫాక్స్ స్క్రీన్ సేవర్ గా మారిపోతుంది..
Monday, March 24, 2008 | 0 Comments
రోజువారి కార్యకలాపాలు రికార్డ్ చేసుకోవడానికి

వృత్తిపరంగా ఎల్లప్పుడూ బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ తమ్ అరోజువారీ కార్యకలాపాలను ముందుగానే నమోదు చేసి పెట్టుకోవడానికి ఉపయోగఫడే సాఫ్ట్ వేర్ ప్రోగ్రామే My Personal Diary . ఇందులో మన రోజువారి నిర్వర్తించవలసిన కార్యకలాపాలను కొత్త ఎంట్రీలుగా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే...అవసరం అయినప్పుడు ఈ రోజు/వారం/నెలలో ప్లాన్ చేసుకున్న కార్యక్రమాల వివరాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
Monday, March 24, 2008 | 0 Comments
విండోస్ XP టిప్స్….
Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏవైనా కొత్త సాఫ్ట్ వేర్లని సరిగ్గా పని చెస్తాయో లేదో తెలియని డివైజ్ డ్రైవర్లని ఇన్‌స్టాల్ చేసుకునే ముందు Accessories>System Tools ప్రోగ్రామ్ ఫోల్డర్‌లో ఉండే System Restore అనే ఆప్షన్‌ని ఉపయోగించి ఒక Restore Point ని క్రియేట్ చేసుకోవడం మంచిది.
మీవద్ద Bootable WinXP సిడి లేదా? అయితే మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో లభించే ఓ టూల్‌ని ఉపయోగించి XP బూటబుల్ ఫ్లాపీలను క్రియేట్ చేసుకోవచ్చు. XP ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్న సమయంలో Setup ముందుకు సాగకుండా ఫ్రీజ్ అయిపోయినట్లయితే మీ సిస్టమ్‌లో PCI స్లాట్లపై అమర్చబడి ఉన్న మోడెమ్, టివి ట్యూనర్ కార్డ్, నెట్‌వర్క్ అడాప్టర్ వంటి కార్డులను తొలగించి Setup రన్ చేసి చూడండి. ఇన్‌స్టలేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆ కార్డ్ లను తిరిగి అమర్చుకుని ఫ్రెష్‌గా వాటి డ్రైవర్లని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.
Windows XP Professional తో పాటు డీఫాల్ట్ గా Backup యుటిలిటీ ఇన్‌స్టాల్ అయిపోతుంది. అయితే XP Home ఎడిషన్ యూజర్లు మాత్రం Windows Backup టూల్ కావాలనుకుంటే.. XP ఇన్‌స్టలేషన్ సిడిలో valudeadd\msft\ntbackup\ntbackup.msiఅనే ఫైల్‌ని వెదికిపట్టుకుని దాన్ని డబుల్ క్లిక్ చేస్తే బ్యాకప్ యుటిలిటీ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యబడుతుంది. XP ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫైళ్ళు, సెట్టింగులను యధాతధంగా Win98, Me వంటి పూర్వపు వెర్షన్లకు గానీ, లేదా 2003. Server వంటి తర్వాతి ఆపరేటింగ్ సిస్టమ్‌కి గానీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
దీనికి గాను..Start.Programs>Accessories>System Tools విభాగంలో ఉండే Files and Settings Transfer Wizard అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ప్రత్యక్షమయ్యే డైలాగ్ బాక్స్ లో ఏ ప్రదేశంలో ఈ సెట్టింగులు సేవ్ చేయబడాలన్నది స్పెసిఫై చేయవలసి ఉంటుంది.
ఏదైనా మీ సిస్టంలో ఉన్న ఫోల్డర్‌ని నెట్‌వర్క్ లో ఇతర యూజర్లు కూడా వినియోగించుకునే విధంగా షేర్ చెయ్యదలుచుకుంటే, ఆ ఫోల్డర్‌పై మౌస్‌తొ రైట్ క్లిక్ చేసి Properties Sharing విభాగాన్ని ఎంచుకోండి. అందులో Share this folder on the network అనే ఆప్షన్‌ని టిక్ చేస్తే సరిపోతుంది.
డీఫాల్ట్ గా విండోస్ XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే Internet Connection Firewal (ICF) ని ఎనేబుల్ చెయ్యదలుచుకుంటే.. Control Panel లో Network Connections అనే విభాగంలో మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మౌస్‌తొ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకుని అందులో Advanced అనే విభాగంలోకి వెళ్ళండి. అక్కడ Protect my computer and network by limiting preventing access to this computer from the internet అనే చెక్ బాక్స్ టిక్ చేయండి.
ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్ కనెక్షన్లు మీ సిస్టంలో ఉన్నట్లయితే ప్రతీ కనెక్షన్‌కూ వేర్వేరుగా ' ఫైర్‌వాల్ ' ని ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ నెట్ కనెక్షన్ నాలుగైదు సిస్టంలకు షేర్ చెయ్యబడి ఉన్నట్లయితే సర్వర్‌గా వ్యవహరిస్తూ నేరుగా ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయి ఉన్న సిస్టంలో మాత్రమే ఫైర్‌వాల్‌ని ఎనేబుల్ చేయండి.
మీ నెట్ వర్క్ కనెక్షన్ గురించి వివరంగా రిపోర్ట్ కావాలనుకుంటే Programs.Accessories>System Tools>System Information డైలాగ్ బాక్స్‌లో మళ్ళీ Tools>Net Diagnostics అనే విభాగంలోకి వెళ్ళి.. Scan అనే బటన్ని క్లిక్ చెయ్యండి. దీనితో మీ విండోస్ ఇన్‌స్టలేషన్‌కి సంబంధించి, నెట్‌వర్క్ కనెక్షన్ యొక్క వివరాలు లభిస్తాయి.
Welcome స్క్రీన్‌లో కనిపించే ఇమేజ్‌ని మార్చదలుచుకుంటే... Control Panel>User Account లో మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని అందులో Change my Picture అనే బటన్ని క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్‌నైతే సెట్ చెయ్యదలుచుకున్నారో దాన్ని స్పెసిఫై చేయండి.
ఏదైనా ప్రోగ్రామ్ యొక్క షార్ట్‌కట్ Start మెనూలో అన్నింటికన్నా పై భాగాన కనిపించే విధంగా సెట్ చెయ్యదలుచుకుంటే Start మెనూ నుండి ఆ ప్రోగ్రామ్ షార్ట్ కట్‌పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Pin to Start Menu అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే సరిపోతుంది.
మీ Recent Documents ఫోల్డర్‌లో ఏయే అంశాలున్నాయో చూడాలనుకుంటే Start>Run కమాండ్ బాక్స్ లో %UserProfile%Recent అని టైప్ చేయండి. సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ సెట్టింగులు వేటినైనా మోడిఫై చెయ్యదలుచుకున్నట్లయితే...Administratorగా లాగిన్ అయి చేయవలసి ఉంటుంది.
ఒక యూజర్ ఫోఫైల్‌ని కాపీ చెయ్యదలుచుకుంటే.. Control Panel/System/Advanced అనే విభాగంలోకి వెళ్ళి User Profiles>Settings అనే ఆప్షన్ ఎంచుకుని ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకుని Copy to ఎంచుకోవాలి.
Sunday, March 23, 2008 | 0 Comments
లాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ ఇవ్వాలంటే...

రూ.26 వేల రూపాయల నుండే ప్రాధమిక స్థాయి లాప్ టాప్ లు లభిస్తుండడంతో ఇటీవలి కాలంలో చాలామంది లాప్ టాప్ ల కొనుగోలుకి మొగ్గు చూపుతున్నారు. లాప్ టాప్ విషయంలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్! ఖరీదైన మోడళ్ళు అయితె నాలుగు గంటలకు మించి బ్యాటరీ బ్యాకప్ లభించదు. ఈ నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ బ్యాటరీ ఇప్పటికన్నా ఎక్కువ సమయం వచ్చేలా చేయవచ్చు. కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న అప్లికేషన్లని మాత్రమే ఓపెన్ చేసి మిగిలిన వాటిని క్లోజ్ చేయండి. బ్యాటరీపై నడిచేటప్పుడు స్క్రీన్‍ని డిమ్ చేయండి. లాప్ టాప్ అడుగుభాగంలో వేడి బయటికి ప్రసరించడానికి holes ఉంటాయి. వేడి బయటకు వెళ్ళకుండా ఆ holes కి ఏదైనా అడ్డుగా ఉంటే లోపలి ఉష్ణోగ్రతలు పెరిగి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అలాగే బ్యాటరీపై నడిచేటప్పుడు డివిడి మూవీలను చూడడం గానీ, ఎక్కువ సిస్టమ్ వనరులను ఉపయోగించుకునే త్రీడి గేమ్‍లను ఆడడం గానీ చేయకండి. USB పోర్టులకు కనెక్ట్ చేసుకునే డివైజ్‍ల సంఖ్య పెరిగే కొద్ది వాటికి విద్యుత్ సరఫరా చేయబడుతుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. వీలైనన్ని తక్కువ USB డివైజ్‍లను కనెక్ట్ చేయండి. లాప్‍టాప్‍ని Standby, Hibernate చేయకండి. నేరుగా సూర్యకాంతిలో వాడకండి. Wireless LAN (WLAN) , Bluetooth వంటి అదనపు సదుపాయాలని అవసరం లేనప్పుడు డిసేబుల్ చేయండి. బ్యాటరీ ఆదా అవుతుంది.
Saturday, March 22, 2008 | 4 Comments
సమయం గురించి అన్ని కోణాలలో వివరాలు
Saturday, March 22, 2008 | 0 Comments
మౌస్ తో డబల్ క్లిక్ చేస్తే ఫలితం లేకపొతే ....
ఫైళ్ళు, ఫోల్డర్లు, ప్రోగ్రాములను ఓపెన్ చెయ్యడానికి మౌస్ తో డబల్ క్లిక్ చేస్తుంటాం. అయితె ఒక్కోసారి సింగిల్ క్లిక్ సక్రమంగానే పనిచేస్తూ డబల్ క్లిక్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఆగిపోతుంది. దీనికి ప్రధాన కారణం Mouse Properties లో డబల్ క్లిక్ రేట్ ని పూర్తి Fast గా సెట్ చేసి ఉంచడం. వెంటనే Control Panel>Mouse>Buttons విభాగంలో ఉండే Double Clik speed ని మధ్యస్తంగా సెట్ చేయండి. సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది.
Friday, March 21, 2008 | 0 Comments
ఫోటో బకెట్

మీ డిజిటల్ కెమేరా ద్వారా తీసుకున్న ఫోటోలను అప్ లోడ్ చేసుకోవడానికి ఎన్నో ఇమేజ్ హోస్టింగ్ సర్వీసులు ఉన్నప్పటికీ http://photobucket.com/about అనే సర్వీసు ఎంతోకాలంగా చక్కని సర్వీసును అందిస్తోంది. ఈ వెబ్ సైట్ లోకి ఫోటోలను, వీడియొలను అప్ లోడ్ చేసుకోవడమే కాకుండా మీ ఫోటోల ఆధారంగా ఉచితంగా ఆకర్షణీయమైన ఆల్బం లను రూపొందించుకోవచ్చు. ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయ్యే విధంగా స్లైడ్ షోల రూపంలో పొండుపరుచుకోవచ్చు. వీడియోలు, మ్యూజిక్ ఫైల్లని సైతం స్లైడ్ షోలో పొందుపరుచుకునే అవకాశం లభిస్తోంది. ఫోటో బకెట్ ద్వారా హోస్ట్ చేసుకున్న మీ మీడియా ఫైల్లని మెయిల్, యాహూ మెసెంజర్ వంటి ఇన్ స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాములు, సెల్ ఫోన్ల ద్వారా మీ స్నేహితులతో పంచుకుని వారి యొక్క స్పందనను కూడా పొందవచ్చు.
Friday, March 21, 2008 | 0 Comments
అన్ని లింకుల్లోని ఇమేజ్ లను తెచ్చే ప్రోగ్రాం

ఇంటర్నెట్ పై అనేక వెబ్ సైట్లలో భారీమోట్టంలో పిక్చర్ గ్యాలరీలు పొందుపరచబడి ఉంటాయి. ఒక్కో గ్యాలరీని ఎక్స్ ప్లోర్ చేస్తూ ఫోటొలను సేకరించడానికి ఇబ్బందిపడేవారు Picaloader అనే సాఫ్ట్ వేర్ ఉపయోగించి వెబ్ సైట్లలోని
ఫోటోలను ఆటోమేటిక్‌గా పొందవచ్చు. ఈ సాఫ్ట్ వేర్‌లో ఒక వెబ్ సైట్ అడ్రస్ ఇస్తే ఆ సైట్‌లోనూ , ఆ సైట్‌కి లింక్ చేయబడి ఉన్న ఇతర సైట్లలోనూ ఉన్న ఇమేజ్‌లన్నీ డౌన్ లోడ్ చేయబడతాయి.
Friday, March 21, 2008 | 0 Comments
వేర్వేరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్లు వాడాలా ??
Thursday, March 20, 2008 | 0 Comments
ముఖ్యమైన సమాచారాన్ని వెదికి పట్టుకోవాలంటే
మీ స్నేహితులు పంపించిన SMS మెసేజ్‌లలో ఎక్కడో ముఖ్యమైన సమాచారం ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూద్దామంటే Inbox ఉన్న భారీ మొత్తంలోని మెసేజ్‌లను ప్రతీదాన్నీ ఓపెన్ చేసే ఓపిక మీకు లేదనుకోండి. అలాంటప్పుడు AllFinder అనే సాఫ్ట్ వేర్ సాయం తీసుకోండి. NokiaS60 3rd జనరేషన్ ఫోన్లు అయిన N71, N93,E60, E61, E70,E50,5500, N91 వంటి మోడళ్ళపై ఈ సాఫ్ట్ వేర్ పనిచేస్తుంది. ఈ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏ పదం కోసమైతే వెదకదలుచుకున్నారో ఆ పదాన్ని టైప్ చేస్తే.. మీ ఫోన్‌లోని SMS, Email, Calendar, Contact List వంటి వేర్వేరు ప్రదేశాల్లో ఆ పదం వెదకబడి ఎక్కడ తారసపడినా పట్టుకోబడుతుంది.
Thursday, March 20, 2008 | 0 Comments
ఇమేజ్‍ల క్వాలిటీని తిరిగి రప్పించే ప్రోగ్రామ్
Thursday, March 20, 2008 | 0 Comments
ఫైర్ఫాక్స్ కీబోర్డ్ షార్ట్ కట్‍లు
ఫైర్ ఫాక్స్ కొన్ని విషయాల్లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కన్నా వెనుకబడి ఉంది. యూనికోడ్ తెలుగు డిస్‍ప్లే అవాలంటే "పద్మ" వంటి ధర్డ్ పార్టీ ప్లగ్‍ఇన్‍లను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఐతే IE లో ఉన్న సెక్యూరిటీ లోపాల గురించి, వాటి తీవ్రత గురించి చాలామందికి తెలియదు. మైక్రోసాఫ్ట్ నిపుణులు నిరంతరం ఆయా లోపాలను సరిచేయడానికే పని చేస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఫైర్ ఫాక్స్ చాలా ఉత్తమమైనదే , IE కన్నా!. IE లో మాదిరిగానే Firefox లోనూ కీబోర్డ్ షార్డ్ కట్‍లను ఉపయోగించి పలు పనులను చేసుకోవచ్చు. Ctrl + T అనే కీబోర్డ్ షార్ట్ కట్ ఉపయోగిస్తే ఒక ఖాళీ టాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కావలసిన వెబ్‍సైట్‍ని ఓపెన్ చేసుకోవచ్చు.
Ctrl + R షార్ట్ కట్ ద్వారా ప్రస్తుతం ఉన్న టాబ్‍లోని వెబ్‍సైట్ రిఫ్రెష్ చేయబడుతుంది. Alt + Home ద్వారా హోమ్ పేజికి, Ctrl + Tab షార్ట్ కట్ ద్వారా ప్రస్తుతం ఉన్న టాబ్ నుండి తర్వాతి టాబ్‍కి, Ctrl + Shift + Tab ద్వారా ముందరి టాబ్‍కి, Esc కీని ప్రెస్ చేయడం ద్వారా లోడ్ అవుతున్న పేజిని నిలుపుదల చేయడానికి, Ctrl + Shift +T ద్వారా క్లోజ్ చేసిన టాబ్‍ని తిరిగి పొందడానికి వీలవుతుంది.
Wednesday, March 19, 2008 | 1 Comments
టాస్క్ బార్ నుండే విండో ప్రివ్యు
Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్‍లో పలు అప్లికేషన్లని ఓపెన్ చేసినప్పుడు టాస్క్ బార్‍పై ఆయా అప్లికేషన్ల పేర్లపై మౌస్ పాయింటర్‍ని ఉంచితే ఆ అప్లికేషన్ యొక్క విండో ప్రివ్యూ చూపించబడుతుంది కదా! అదే విధమైన సదుపాయాన్ని Win XPలో పొందాలంటే Visual Task Tips అనే కేవలం 90KB మాత్రమే పరిమాణం గల ప్రోగ్రామ్‍ని మీ కంఫ్యూటర్లో ఇన్‍స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత టాస్క్ బార్‍పై ఏ అప్లికేషన్ యొక్క మీద అయినా మౌస్‍ని ఉంచితే దాని ప్రివ్యూ వస్తుంది.
Wednesday, March 19, 2008 | 1 Comments
ఒక ఫోన్ లోని మెసేజ్ లు మరో ఫోన్లోకి ...
ఫార్వర్డ్ చేస్తుంది. ఇలా తమ ఫోన్‍లోని మెసెజ్‍లు మీ ఫోన్‍కి చేరవేయబడుతున్నాయన్న సందేహం మీ పిల్లలకు కలుగకుండానే ఇదంతా జరుగుతుంది. టీనేజ్ పిల్లల నడవడికపై ఓ కన్నేసి ఉంచాలనుకునే తల్లితండ్రులకు ఇది పనికొస్తుంది.
Wednesday, March 19, 2008 | 0 Comments
ఎ కలర్ పేరేమిటో మీకు తెలుసా ?

చాలా మంది ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ, నలుపు, మేజెంటా వంటి రంగులు మాత్రమే చెప్పగలుగుతారు. మనం తరచుగా చూస్తూ కూడా వాటి పేర్లు తెలియని అనేక రంగుల పేర్లు తెలుసుకోదలుచుకుంటే name-that color -అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి డ్రాప్ డౌన్ లిస్టు లో కన్పించే వేర్వేరు వర్ణాలను తనివితీరా వీక్షించి వాటి పేర్లు తెలుసుకోవచ్చు. అలాగే ఏవైనా వర్ణాల యొక్క RGB విలువలను ఇచ్చినా వాటి పేరు లభిస్తుంది. చిరాగ్ మెహతా అనే భారతీయుడు రూపొందించాడు ఈ సదుపాయాన్ని.
Saturday, March 15, 2008 | 3 Comments
అన్ని ఫైలు షేరింగ్ నెట్ వర్క్ లను వెదకడానికి
Saturday, March 15, 2008 | 1 Comments
చదివిన తర్వాత మెసెజ్ కనిపించకుండా చెయలా?
Friday, March 14, 2008 | 2 Comments
XP స్టార్ట్ బటన్ పేరుకి మరో మార్గం
Start బటన్ యొక్క పేరుని Startకి బదులుగా మీకు నచ్చిన విధంగా మార్చడానికి అనేక మార్గాలున్నాయి. StartBtn Renamer అనే ఈ ప్రోగ్రామ్ ఓపెన్ సోర్స్ కోవకు చెంది ఉండడం వల్ల ఒకవేళ మీకు కావాలంటే ఈ ప్రోగ్రామ్ యొక్క రూపాన్ని మీకు నచ్చినట్టు సోర్స్ కోడ్‍ని మోడిఫై చేయడం ద్వారా మార్చుకోవచ్చు.
Friday, March 14, 2008 | 1 Comments
CGI స్క్రిప్ట్ ల వలన తలెత్తే అనర్ధాలు
వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్న వారికి CGI Scripts గురించి తెలిసే ఉంటుంది. CGI Common Gateway Inerface అని అర్ధం. Perl,Tcl,C , C++ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల ద్వారా ఈ స్క్రిప్టులను రాస్తుంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఇంటర్ రిజల్ట్స్ కోసం వెబ్‌సైట్ ఓపెన్ చేసారనుకోండి. Candidate number టైప్ చేయమని ఓ HTML వెబ్‌పేజ్ కోరుతుంది. మనం నెంబర్ టైప్ చేసిన తర్వాత దానిని తీసుకుని బ్యాక్ గ్రౌండ్‌లో CGI స్క్రిప్ట్ అందరు అభ్యర్థుల ఫలితాలతో కూడిన డేటా బేస్‌లో వెతుకుతుంది. ఆ నెంబర్ యొక్క ఫలితం డేటా బేస్‌లో దొరికిన వెంటనే ఈ CGI స్క్రిప్ట్ మళ్ళీ HTML పేజి రూపంలో యూజర్ యొక్క కంప్యూటర్లో స్క్రీన్ మీద ఫలితాన్ని చూపిస్తుంది. అంటే ప్రశ్నకి డేటా బేస్‌కి మధ్య ఈ స్క్రిప్ట్ వాహకంగా పనిచేస్తుందన్న్నమాట. అయితే CGI స్క్రిప్టులు అధికశాతం సెక్యూరిటీ లోపాలను కలిగి ఉంటాయి. ఈ స్క్రిప్ట్ లను రాసే ప్రోగ్రామర్లు తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఇవి అనేక ఇబ్బందులకు దారి తీస్తుంటాయి. CGI స్క్రిప్ట్ లలో ఉన్న రిస్క్ ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల మరింత సురక్షితంగా ఉండే సర్వర్ ప్రాసెసింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ASP (Active Server Pages ), JSP ( java server pages), servlets, వంటివి బాగా వాడుకలో ఉన్నాయి.
Friday, March 14, 2008 | 5 Comments
మంచితనం మూర్తీభవించిన మిత్రునికి జన్మధిన శుభాకాంక్షలు
ట్రెక్కింగ్ లో సేదదీరుతూ మిత్రులు గిరిచంద్
అందరూ మాటలు చెబుతారు.. కొందరే చేతల్లో చూపిస్తారు. ఆ చేతలు కూడా మనస్ఫూర్తిగా నిర్వర్తించి అందరికీ ఆత్మీయులవుతారు. అటువంటి అరుదైన ఆదర్శదాయకమైన వ్యక్తిత్వం నువ్వుశెట్టి సోదరుల్లో ఒకరైన గిరిచంద్ గారిది. కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఛాట్ రూమ్ ప్రారంభమైనది మొదలుకుని నిరంతరం దానిని అభివృద్దిపరచడంలో, చాట్ లో జరిగిన సంభాషణలను అర్థవంతంగా పదిలపరచడంలో, కొత్తవారిని ఉత్తేజపరచడంలో, ఛాట్ లో సందర్భానుసారం నవ్వులు పూయిస్తూ ఉల్లాసాన్ని నింపడంలో ఆయనది అందెవేయిన చేయి. నిజంగా గిరిచంద్ లాంటి మిత్రులు కంప్యూటర్ ఎరా టీమ్ మొత్తానికీ లభించినందుకు నేను వ్యక్తిగతంగా గర్వపడని రోజంటూ లేదు. మీజిల్స్ తో బాధపడుతూ నిలువెల్లా నీరసం ఆవహించినా ఛాట్ లో ఓపిగ్గా పలువురి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అవసరమైతే మధ్యలో ఫోన్ చేస్తూ ఆయన ప్రదర్శించిన కమిట్ మెంట్ మనసుని కదిలిస్తుంది. మానవత్వమంటే ఇదే అన్పిస్తుంది. అవకాశం వస్తే అందరూ కబుర్లు చెబుతారు, కానీ గిరిచంద్ గారిలా కట్టుబడేవారు చాలా చాలా అరుదు. వారు తమ స్నేహపూరిత స్వభావంతో అందరినీ సమన్వయపరుస్తూ ఛాట్ లో పోషిస్తున్న పాత్ర నిజంగా అద్భుతమైనది. నేను ఈ ప్రాజెక్ట్ కి కట్టుబడి పనిచేస్తాను అని ఆయన ప్రకటించిన క్షణం నుండి ఈరోజు వరకూ ఆయనలో అదే ఉత్సాహం. మనిషి ఆర్థికంగా ఎదగవచ్చు.. కానీ మానవత్వంలో మనీషి గా ఎదడగమెలాగో ఆత్మీయులు గిరిచంద్ గారిని చూస్తే అర్థమవుతుంది. ఇది ఆయనని పొగడడం కాదు.. మామూలు సందర్భాల్లో మా టీమ్ సభ్యులందరి మనసులో ఆయనపై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నా అవి వ్యక్తపరడానికి సరైన సందర్భం లభించదు, అందుకే ఆయన గొప్పదనాన్ని కనీసం ఆయన జన్మదినం రోజైనా ఈ పోస్ట్ రూపంలో వ్యక్తపరిచే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గిరిచంద్ గారు మనసువిప్పి చెబుతున్నాను మీరు మాకు అత్యంత ఆత్మీయులు, మిమ్మలను చూసి, మీ కమిట్ మెంట్ ని చూసి గర్వపడని క్షణమంటూ లేదు. మీ వ్యక్తిత్వంలోని ఔన్నత్యం మరో పదిమందికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తూ..
జ్యోతి, ప్రసాద్, జీవి, శ్రీనివాస్ కర, సాయి పోతూరి, జాకబ్, మొయిన్, జాహ్నవి, రాధిక, రామ్ యనమల, వినయ్, రవీంద్ర కాట్రగడ్డ, టి.రామచంద్రరావు, నాగభూషణం, నరేష్ వంటి ఎందరో మిత్రుల ఆశీస్సులతో మీరు కలకాలం ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...
- మీ మిత్రుడు
నల్లమోతు శ్రీధర్
Tuesday, March 11, 2008 | 13 Comments
ప్రసిద్ధి గాంచిన మొదటి ఐదుగురు హ్యాకర్లు
యునైటెడ్ స్టేట్స్ లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి ఇతను. Adrian Lamo ది తర్వాతి స్థానం. మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసిన ఘనత ఇతనిది. మూడవ స్థానంలో Jonathan James నిలుస్తాడు. కేవలం 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపించబడిన ఘనత ఇతనిది. Defence Threat Reduction Agency వంటి అత్యంత కీలకమైన సంస్థల వెబ్‍సైట్లని హ్యాక్ చేసి ముచ్చెమటలు పోయించాడు ఇతను. తర్వాతి స్థానం Robert Tappan Morris ది. Morris అనే వార్మ్ సృష్టికర్త్గ ఇతను.నెట్ ద్వరా వ్యాప్తి చెందిన మొట్టమొదటి వార్మ్ గా దీన్ని చెప్పవచ్చు. చివరి స్థానాన్ని Kevin Poulsen ఆక్రమిస్తాడు. FBI ఇతని కోసం వెతుకుతుంది.
Tuesday, March 11, 2008 | 1 Comments
యు ట్యూబ్ నుండి వీడియోల డౌన్ లోడింగ్ కి
ప్రముఖ విడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన www.youtube.com సైట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని వాటిని iPod, iPhone, PocketPC, PSP, Zune, 3GP వంటి వేర్వేరు వీడియో ఫార్మెట్ల లో కన్వర్ట్ చేయడానికి YouTubeRobot అనే సాఫ్ట్ వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉన్నా ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంటుంది.
Tuesday, March 11, 2008 | 0 Comments
సులభంగా వాడదగ్గ డెస్క్ టాప్ షేరింగ్ ప్రోగ్రాం

అనుకోకుండా మీరు ఊరు వెళ్లవలసి వచ్చింది. మీ వద్ద లాప్ టాప్ లేదు. మీ కంప్యూటర్ ని మీరు వెళుతున్న ఊరి నుండి యాక్సెస్ చేద్దామంటే ఇక్కడ మీ పిసిని అలా ఆన్ చేసి వెళ్ళాలి. అప్పుడే R Admin, Logmein వంటి సర్వీసుల ద్వారా యాక్సెస్ చేయగలుగుతారు. ఒకవేళ పొరబాటున కరెంట్ పొతే ఇక్కడ ఉన్న అ మీ పిసి ఆప్ అయిపోతే కనెక్షన్ కట్ అయిపోతుంది. ఈ నేపధ్యంలో Webtop అనే సర్వీసు ఎంతొ ఉపయుక్తంగా ఉంటుంది. ముందు మీ కంప్యూటర్ లోని ముఖ్యమైన ఫైల్లని webtop సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ లోకి అప్ లోడ్ చేసుకోండి. ఇప్పుడు పై చిత్రంలో విధంగా మీరు ఎక్కడి నుండైనా యాక్సెస్ చేసుకోగలిగేలా ఒ వర్చ్యువాల్ డెస్క్ టాప్ క్రియేట్ అవుతుంది. ఎ ఊరిలో ఉన్నా ఈ సర్విఇసులోకి ప్రవేశించి మీరు ఇంతకుముందు అప్ లోడ్ చేసుకున్న ఫిల్లని ఉపయోగించుకోవచ్చు. అయితె ఎక్కువ స్పీడ్ కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే దీనిని ఉపయోగించడం బావుంటుంది. యూజర్ నేఁ , పాస్ వర్డ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Tuesday, March 11, 2008 | 0 Comments
రేగోడియాలు
తాడిమేటి రామ శ్రీనివాస లక్ష్మీనారాయణ శివనాగ రాజారావు అనబడే తాడిమేటి రాజారావుగారి బ్లాగు ఇది. కొల్లేటి చాంతాడంత ఉన్న తన పేరు పురికొసగా మారడానికి గల కారణాలు వివరిస్తూ ఆగస్టు 2007 లో బ్లాగు మొదలెట్టారు రాజారావుగారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ వాస్తవ్యులైన రాజారావుగారు ప్రస్తుతం San Jose,California లో Cisco Systems లో Software Engineer గా పనిచేస్తున్నాను. వారి అర్ధాంగి వసుంధర కూడా బ్లాగరే..
చాలా మంది బ్లాగర్లలాగే రాజారావుగారు తన బ్లాగులో ఎక్కువగా తన ఆలోచనలు, మరిచిపోలేని జ్ఞాపకాలు, చిన్ననాటి ఆటలు, అమెరికాలో పడుతున్న తిప్పలు , తను చూసిన సినిమాల గురించి రాస్తూ అందరితో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. నేను నా ఊరు అనే వర్గంలో తన చిన్ననాటి ఆటలు, తన ఊరిలోని విశేషాలు ఎంతో వివరంగా చెప్పారు. తన బ్లాగులో ఊసుపోక జాబులు రాయకుండా ఎంతో మానసిక వికాసాన్నీ, శారీరక వ్యాయామాన్నీ, మరచిపోలేని అనుభూతులనీ, మిత్రులనీ అందించిన కొన్ని ఆటల గురించి వివరించారు. ముఖ్యమైనవి ఉదయం మొదలుపెట్టి రాత్రి అమ్మలు వచ్చి చెవి మెలేసి పట్టుకెళ్ళేదాకా అడిన సబ్జా విండూర్, పెంకులాట, రోజు అమ్మతో చీవాట్లు తిన్నా విడువని వీపు చట్నీలు, అష్టాచెమ్మా, వైకుంఠపాళి మొదలైనవి . రాజారావుగారి ఈ టపాలు , ఎందరో బ్లాగరులు ఉద్యోగ,కుటుంబ భాధ్యతలలో పడి మర్చిపోయిన చిన్ననాటి స్మృతులను మళ్ళీ గుర్తుకు చేసుకునేలా చేసాయి అంటే అతిశయోక్తి కాదు. రాజారావుగారి బ్లాగులోని టపాలు చదువుతుంటే అవి మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగానే ఉంటాయి. అంత వివరంగా ఉంటాయన్నమాట. అరే !ఇవి మనకు తెలిసినవే కదా అనుకోవడం కూడా జరుగుతుంది.
రాజారావుగారు తన అభిప్రాయాలని చాలా నిర్మొహమాటంగా చెప్తారు. తన చాకిరేవు వర్గంలో అమెరికాలోని భారత సూపర్ బజార్లలొ జరిగే తేదీ ఎక్స్ పైరు అయిపోయిన సరుకులు అమ్మడం గాని, జెమిని టీవీలో వచ్చే "చిత్ర"హింసలు, ఎన్నో ఇంగ్లీషుపదాలను తెలుగులోకి మార్చాలని ప్రయత్నిస్తున్న తెలుగు బ్లాగర్లని, చందమామ, చిరుత చూసి కలిగిన అనుభవం మొదలైన వెన్నింటినో నిజంగానే చాకిరేవు పెట్టేసారు. మా ఊరు వీధి సినిమా కాని గోళీసోడా కాని చదివిన వారెవరైనా వావ్ ! సూపర్ అనుకోకమానరు తమ అనుభవాలు కూడా ఏకరువు పెట్టకుండా ఆగలేరు మరి. అప్పుడప్పుడూ తమ అమెరికా అనుభవాలు కూడా సవివరంగా రాస్తుంటారు.తరచుగా రాయకున్నా, ఆయన రాసిన టపాలన్నీ కూడా చదువరులను ఆకర్షించి ఆలోచింప చేస్తాయి. ఈ రెగోడియాలు బ్లాగు పేరు , దాని ట్యాగ్ లైన్ లాగానే నిజంగా ఈ రేగొడియాలు తీయ తీయగా కొంచెం కారం కారంగా ఉంటాయనడం లో అతిశయోక్తి లేదు.
Sunday, March 09, 2008 | 2 Comments
నోకియాని మింగేస్తున్న Nokla
Sunday, March 09, 2008 | 2 Comments
గూగుల్‌ని మరింత బాగా వెదకడం ఇలా...

ఇంటర్నెట్‌పై గడిపే సగటు పిసి యూజర్‌కి www.google.com అనే వెబ్‌సైట్ ఒక్క రోజు ఓపెన్ చేయకపోయినా పొద్దు పొడవదు Googleలో మీరు ఎన్నో రకాల కీవర్డ్ లు టైప్ చేసి వెదుకుతూ ఉంటారు.అయితే మీరు ఒక వీడియో కోసమో, ఆడియో ఫైల్ కోసమో, సాఫ్ట్ వేర్లు వంటి ఇతరత్రా అంశాల కోసమో గూగుల్‌లో వెదకాలంటే ఆ పదాన్ని వేర్వేరు రకాలుగా Search బార్‌లో టైప్ ఛేసి వెదుకుతుంటారు. అసలు మీరు వెదకదలుచుకున్నది ఏ తరహా ఫైలో ముందే మీరు నిర్ణయించుకోగలిగితే Google Hacks అనే ప్రోగ్రాంని ఉపయోగించి అందులో కనిపించే Music, Book, Video, Tools, Hacks, Torrent, Web Hosting వంటి వేర్వేరు విభాగాల్లో కావలసిన అంశాన్ని టిక్ చేయడం ద్వారా కేవలం ఆ తరహా ఫైళ్ళే వెదకబడేలా చేయవచ్చు.
Sunday, March 09, 2008 | 1 Comments
2MB సైజులోనే ఎం.ఎస్. ఆఫీసుకి ప్రత్నామ్నాయం

మీ ఇంట్లో నెట్ పనిచేయకపోవడం వల్ల బయటి ఇంటర్నెట్ సెంటర్ ద్వారా నెట్‍ని బ్రౌజ్ చేయడానికి వెళ్ళారనుకుందాం. అకస్మాత్తుగా ఆ సిస్టమ్‍లో మీ వద్ద ఉన్న Excel డాక్యుమెంట్లని మోడిపై చేయవలసి వచ్చింది. తీరా చూస్తే అక్కడి కంప్యూటర్లలొ MS. Office ఇన్‍స్టాల్ చేయబడి లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆందోళన చెందకండి. Floppy Office అని ముఖ్యమైన టూల్స్ తో కూడిన ఓ సాఫ్ట్ వేర్ లభిస్తుంది. ఇది 2MB కన్నా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇందులో పొందుపరచబడిన అప్లికేషన్లని ప్రత్యేకంగా ఇన్‍స్టాల్ చేయవలసిన అవసరం లేదు. నేరుగా రన్ చేసుకోవడమే. ZIP ఫైల్‍లో పొందుపరచబడి ఉండే ఈ టూల్స్ ని USBమెమరీ స్టిక్‍లోకి కాపీ చెసి వాడుకోవచ్చు. FTP క్లయింట్, Rich Text ఏడిటర్, నోట్‍పాడ్ తరహా ఎడిటర్, స్ప్రెడ్ షీట్ ప్రోగ్రామ్, POP Mail క్లయింటూ, వెక్టార్ గ్రాఫిక్స్ ఎడిటర్ ఉన్నాయి.
Saturday, March 08, 2008 | 1 Comments
డివైజ్ డ్రైవర్లని సక్రమంగా తొలగించకపోతే

ఏదైనా హార్డ్ వే పరికరాన్ని సిస్టమ్ నుండి తొలగించిన తర్వాత దాని డివైజ్ డ్రైవర్లని కూడా తీసేయడం ఉత్తమం. అలాగే మీ డివైజ్ డ్రైవర్లని లేటెస్ట్ వెర్షన్‍తో అప్‍గ్రేడ్ చేసుకునే ముందు పాత డ్రైవర్లని డివైజ్ మేనేజర్ ద్వారా uninstall చేసుకోండి. నిరుపయోగంగా లేదా పాతవి,,కొత్తవి రెండు వెర్షన్లుగా సిస్తమ్‍లో పేరుకుని పోయే డివైజ్ డ్రైవర్లు బూటింగ్ సమయంలో సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. ఏయే డివైజ్ డ్రైవర్లు మీ సిస్టమ్‍లో వృధాగా పడి ఉన్నాయో మీరు గుర్తించకపోతే ఇంటర్నెట్‍లో Driver Sweeper పేరిట ఓ సాఫ్ట్ వేర్ లభిస్తుంది. అది డౌన్‍లోడ్ చేసుకుని ఇన్‍స్టాల్ చేయండి. అది సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేసి వృధాగా పడి ఉన్న డివైజ్ డ్రైవర్లని చూపిస్తుంది. వాటిని నిస్సందేహంగా తొలగించవచ్చు.
Saturday, March 08, 2008 | 1 Comments
విండోలను ట్రాన్స్ పరెంట్‍గా మార్చుకోవడం..
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍లో మీరు ఏ విండోనైనా పై చిత్రంలోని విధంగా ట్రాన్స్ప్ రెంట్‍గా (క్రింది విండోలోని సమాచారం కూడా కన్పించేలా) మార్చుకోవాలంటే Vitrite అనే చిన్న ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. దీనిని ఇన్‍స్టాల్ చేసిన తర్వాత ఇది సిస్టమ్ ట్రేలోకి వెళ్ళి కూర్చుంటుంది.ఇక మీరు ఏ విండోలో ఉన్నప్పుడైనా Ctrl+Shift+1 లేదా Ctrl+Shift+2 మాదిరిగా వరుసగా కీబోర్డ్ షార్ట్ కట్‍లను ఉపయోగిస్తే అది ట్రాన్స్ పరెంట్‍గా అవుతుంటుంది.
Thursday, March 06, 2008 | 0 Comments
ఎ వెబ్ సైట్లో ఎ టెక్నాలజీ వాడబడింది
వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, లేదా తమకు తాము స్వంతంగా వెబ్ సైట్లని రూపొందించుకోదలుచుకున్న వారికినెట్‍లో వివిధ ఆకర్షణీయమైన వెబ్ సైట్లని చూసినప్పుడు అవి ఏ వెబ్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడ్డాయన్న ఆసక్తి కలగడం సహజం. మీకు తారసపడే ఏ వెబ్‍సైట్ అయినా ఏయే టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడిందో తెలుసుకోవాలనుకుంటే builtwith అనే వెబ్ సైట్‍ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్‍లో మీరు ఏ సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేసి Lookup అనే బటన్ని క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి.
Thursday, March 06, 2008 | 3 Comments
అన్ని రకాల కాలిక్యులేషన్స్ చేయాలంటే
ఒక అంగుళానికి ఎన్ని మిల్లిమీటర్లు, ఎన్ని సెంటిమీటర్లు, ఒక మైలుకి ఎన్ని సెంటిమీటర్లు, అంగుళాలు ఉంటాయి వంటి ధర్మసందేహాలు వస్తే మీ వద్ద ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే వెంటనే worldwide metric అనే వెబ్ పేజిని ఓపెన్ చేయండి. ఇందులో నిడివి, బరువు, వత్తిడి, పరిమాణం, ఉష్ణోగ్రత వంటి వేర్వేరు అంశాలను వేర్వేరు ప్రమాణాల్లో కొలిచే సదుపాయం లభిస్తోంది. ఏదైనా బాక్శ్ లో మీకు కావలసిన విలువని టైప్ చేసి Calculate అనే బటన్‍ని ప్రెస్ చేసారంటే, వెంటనే ఇతర ప్రమాణాల్లో అది ఎంత విలువ అవుతుందో కనిపిస్తుంది.
Wednesday, March 05, 2008 | 1 Comments
మార్చి నెల కంప్యూటర్ ఎరా
Tuesday, March 04, 2008 | 0 Comments
అన్ని రకాల వీడియొలను వెదకడం

Youtube, Google Video, Bglip.tv వంటి వీడియో షేరింగ్ వెబ్ సైట్లతో పాటు CNBC, ABC News, BBC వంటి ప్రముఖ వార్తా సంస్థలు కూడా ప్రముఖ వార్తలను వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరుస్తున్నాయి. ఈ నేఫధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో కోసం వెదికే కన్నా www.truveo.com అనే వెబ్ సైట్‍ని సందర్శించండి. ఇందులో Search బాక్స్ లో మీరు ఏ కీవర్డ్ టైప్ చేసినా అన్నివీడియో సైట్లలో వెదకబడుతుంది. ఈ వెబ్‍సైట్ ద్వారా మనం టైప్ చేసిన కీవర్డ్ కేవలం ఒక నిర్ధిష్టమైన విభాగంలోనే (స్పోర్ట్స్, ఎంటర్‍టైన్‍మెంట్) వెదకబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు.అలాగే బాగా పాపులర్ అయిన వీడియోలను మాత్రమే, లేదా ఎక్కువ మంది చూసిన వీడియోలను మాత్రమే లేదా తాజాగా అప్‍లోడ్ చేయబడిన వీడియోలను మాత్రమే .. ఇలా భిన్న అంశాల ఆధారంగా వీడియోలను వెదికే అవకాశం కల్పించబడింది. ఇందులో టివి షోస్, మూవీక్లిప్స్, మ్యూజిక్ వీడియోస్ వంటి వేర్వేరు విభాగాల క్రింద వీడియోలు అమర్చబడి ఉన్నాయి.
Tuesday, March 04, 2008 | 0 Comments
ఆడిటింగ్ అంటే ఎమిటో తెలుసా ?

ఏదైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలొ ఉన్న కంప్యూటర్లు, ఇతర మౌలిక వనరులను విశ్లేషించి, వాటి ఇంటిగ్రిటీని తనిఖీ చేయడంతోపాటు రక్షణా పరమైన లోపాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తించి చేప్పే ప్రక్రియను EDP Audit అంటారు. సహజంగా ఈ తరహా ఆడిట్లని నిర్వహించడానికి ప్రతీ సంస్థలోనూ EDP Auditor పేరిట ఓ వ్యక్తి నియమించబడి ఉంటాడు ఆడిట్ నిర్వహించడానికి audit softwareలు ఉపయోగించబడుతుంటాయి. ఇవి సంస్థ యొక్క డేటాబేస్‍లను శాంప్లింగ్ చేసి సంస్థ ఖాతాదారులకు , మన సంస్థకు వనరులు సమకూర్చే వెండర్లకు కన్ఫర్మేషన్ లెటర్లు పంపిస్తుంటాయి. సంస్థ యొక్క ఐటి వనరులను విశ్లేషించడానికి Intely Audit వంటి ఆడిటింగ్ సాఫ్ట్ వేర్లు వాడబడుతుంటాయి. వివిధ రకాలైన ఆడిటింగ్ సాఫ్ట్ వేర్లు వేర్వేరు ప్రయోజనాలను సాధించి పెడతాయి. కొన్ని ప్యాకేజీలు రుజువులను సేకరించడానికి ఉపకరిస్తే మరికొన్ని ఎనలటికల్ పరీక్షలునిర్వహించడానికి, మరికొన్ని సంస్థ అంతర్గత నియంత్రణని విశ్లేషించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆడిట్ నిర్వహించబడిన తర్వాత ఆ వివరాలను డాక్యుమెంట్ల రూపంలో పొందుపరచడానికి, నిర్ధిష్ట సమయంలో ఆడిట్ నిర్వహించబడేలా కాన్ఫిగర్ చేయడానికి, ఎక్సెప్షన్ రిపోర్టులను ప్రింట్ చేయడానికి ఇలా పలు రకాల పనులను చేయడానికి సాఫ్ట్ వేర్లు లభిస్తుంటాయి.
Tuesday, March 04, 2008 | 1 Comments
మొబైల్ ఫోన్ల కోసం ఫ్లాష్ ప్లేయర్

Macromedia Flash సాఫ్ట్ వేర్‍తో నాణ్యమైన మల్టీమీడియా కంటెంట్‍ని డిజైన్ చెయ్యవచ్చన్నది అందరికీ తెలిసిందే ! సెల్‍ఫోన్లలో Flash.SWF ఫైళ్లని ప్లే చెయ్యడానికి ప్రస్తుతం కొన్ని ధర్డ్ పార్టీ ప్లేయర్లు లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం స్వయంగా Macromedia సంస్థ Flash Lite 1.1 పేరిట ఓ ఫ్లాష్ ప్లేయర్‍ని మొబైల్ ఫోన్లకోసం విడుదల చేసింది.
Saturday, March 01, 2008 | 1 Comments
20% బ్యాండ్ విడ్త్ XP నే వాడుకుంటుంది…
Windows XP ఆపరేటింగ్ సిస్ట్టమ్‍ని ఉపయోగించే దాదాపు ప్రతీ పిసి యూజర్‍కి తెలియని రహస్యం ఒకటుంది. ఇంటర్నెట్‍ని బ్రౌజ్ చేసేటప్పుడు మొత్తమ్ లభ్యమయ్యే బ్యాండ్ విడ్త్ లో 20% వరకూ XP అప్‍డేట్ల కోసం వెదకడం వంటి అవసరాలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది. మిగిలిన బ్యాండ్ విడ్త్ మాత్రమే మనకు లభిస్తుంటుంది. ఇది మరీ అన్యాయంగా అనిపిస్తుంది కదూ… దీన్ని అధిగమించడానికి Start>Run కమాండ్ బాక్శ్ లో gpedit.msc అని టైప్ చేసి గ్రూప్ పాలసీ ఎడిటర్ ప్రోగ్రామ్‍లోకి వెళ్ళి… Local Computer Policy> Computer Configuration>Administrative Templates>Network>QOS Packet Scheduler>Limit Reservable Bandwidth అనే ఆప్షన్‍ని డబుల్ క్లిక్ చేయండి. ఇది కాన్ఫిగర్ చేయబడలేదని చెబుతున్నప్పటికీ అది వాస్తవం కాదు. Explain అనే tab లో 20% తన స్వంతానికి వాడుకుంటున్నట్లు వివరించబడి ఉంటుంది. దీన్ని అడ్డుకోవడానికి ఆ ఆప్షన్‍ని ఎనేబుల్ చేసి Reservable bandwidthని 0 గా సెట్ చేయండి. సరిపోతుంది..
Saturday, March 01, 2008 | 2 Comments
పిసి ఆన్ చేయగానే ఏమి జరగకపోతే

కంప్యూటర్‍ని ఆన్ చేసిన వేంటనే క్యాబినెట్‍పై LEDలు వెలగకుండా, మోనిటర్‍పై డిస్‍ప్లే రాకుండా, మదర్ బోర్డ్ నుండి ఎలాంటి బీప్‍కోడ్‍లు విన్పించబడకుండా పూర్తి సైలెంట్‍గా ఉన్నట్లయితే క్యాబినెట్‍ని విప్పదీసి మదర్ బోర్డ్ కి, హార్డ్ డిస్క్ , సిడిరామ్ వంటి పరికరాలకు SMPS నుండి వచ్చే పవర్ కేబుళ్ళని ఒకసారి తొలగించి తిరిగి అమర్చండి. అలగే మదర్ బోర్డ్ పై front panel లో స్పీకర్, LED, పవర్ బటన్‍లకు కేబుళ్ళు సరిగ్గా కాన్ఫిగర్ చెయ్యబడ్డాయో లేదో తనిఖీ చేయండి. Front Panel కాన్ఫిగరేషన్ గురించి మీ మదర్ బోర్డ్ మేన్యూవల్‍లో వివరంగా రాయబడి ఉంటుంది. కనెక్టివిటీ మొత్తం సక్రమంగానే ఉండి సిస్టమ్ రెస్పాండ్ అవకపోతున్నట్లయితే SMPS పెయిలైనట్లు భావించాలి. కొత్త SMPS కొనే ముందు అందుబాటులో వేరే సిస్టమ్ యొక్క ప్రస్వ్తుతం మీవద్ద ఉన్న SMPS యొక్క wattageని కలిగిన మరో SMPS ఉన్నట్లయిఏ దాన్ని టెంపరరీగా మీ సిస్టమ్‍లో అమర్చి చూడండి. ప్రాబ్లెమ్ సాల్వ్ అయినట్లయితే కొత్త SMPSని కొని అమర్చుకోండి. SMPS ని కొనేటప్పుడు మీ సిస్టమ్‍లో ఉన్న హార్డ్ వేర్ పరికరాల విద్యుత్ ధృష్టిలో ఉంచుకుని ఎక్కువ వాటేజిది కొనుగోలు చేయండి.
Saturday, March 01, 2008 | 1 Comments















